జగన్ సర్కార్ మరో పంచాయతీ ఆర్గినెన్సు: చిక్కులు ఇవే...

First Published Aug 6, 2020, 8:31 AM IST

నిమ్మగడ్డ ఎన్నికల కమీషనర్    గా ఉండగానే ఫిబ్రవరి 19న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఆర్డినెన్సును జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించడంతో పాటుగా మరికొన్ని విషయాలను అందులో పొందుపరిచారు.

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి హాట్ హాట్ గా నడుస్తుండగానే మరోమారు స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెర మీదకు వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలను స్వీకరించడం ఒక కారణం అయితే.... ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సు మరో కారణం.
undefined
ఆర్డినెన్సు విషయానికి వస్తే... స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పాత ఆర్డినెన్సు స్థానే కొత్త ఆర్డినెన్సును తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఆర్డినెన్సుపై అనేక అనుమానాలు, ఊహాగానాలు, విశ్లేషణలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆర్డినెన్సు కథాకమామీషు ఏమిటో ఒకసారి చూద్దాము.
undefined
నిమ్మగడ్డ ఎన్నికల కమీషనర్ గా ఉండగానే ఫిబ్రవరి 19న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఆర్డినెన్సును జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించడంతో పాటుగా మరికొన్ని విషయాలను అందులో పొందుపరిచారు.(కొన్ని అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కూడా చేసాయి.)
undefined
ఈ ఆర్డినెన్సు ను అనుసరించే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లు మొదలు కావాల్సి ఉండగా..... కరోనా మహమ్మారి కమ్ముకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ ఎన్నికలనువాయిదా వేశారు.
undefined
ఇక్కడిదాకా బాగానే ఉంది. అసెంబ్లీ ఫిబ్రవరిలో సమావేశమయ్యేందుకు ఆస్కారం లేనందున ఆర్డినెన్సును తీసుకువచ్చారు. ఏ ఆర్డినెన్సు కాలపరిమితి అయినా 6 నెలలు మాత్రమే. అసెంబ్లీ సమావేశాలు జరగకపోతే ఆరు నెలలు. ఒకవేళ జరిగితే జరిగిన ఆరు వారాల్లోపు చట్టసభ ఆర్డినెన్సుకు ఆమోదం తెలపాలి.
undefined
శాసన మండలిలో అసలు ఈ బిల్లును ప్రవేశపెట్టడమే జరగలేదు. మూడు రాజధానుల దెబ్బకు అప్రాప్రియేషన్స్ బిల్లే పాస్ అవలేదు. ఇక ఈ పంచాయితీరాజ్ ఆర్డినెన్సు సైతం అప్పుడు శాసన మండలిలో పాస్ కాకుండా ఉండిపోయింది.
undefined
ఆరు వారల గడువు ముగిసిపోయింది. తొలి ఆర్డినెన్సు ఆరు నెలల గడువు సైతం ఇంకో 14 రోజుల్లో ముగుస్తుంది. ఇక ఈ తరుణంలో ప్రభుత్వం మరో ఆర్డినెన్సును తీసుకొచ్చి, దాన్ని పాత ఆర్డినెన్సుకు కొనసాగింపుగా చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది. పాత ఆర్డినెన్సు గడువు ముగియడంతో.... ఆ ఆర్డినెన్సు కింద జారీ చేసిన ఎన్నికల ప్రక్రియ కూడా ఒక ముగిసిన అధ్యాయమనేది న్యాయనిపుణుల మాట.
undefined
ఇక ఈ విషయం అటుంచితే... ఒకే అంశం పై మధ్యలో చట్టసభలు సమావేశమయినప్పటుకి... రెండు సార్లు ఆర్డినెన్సులు జారీ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానమూతప్పుబట్టిన సందర్భాలున్నాయి. అంతే కాకుండా ఆర్డినెన్సును ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని, కానీ ఆర్డినెన్సులేచట్టసభలకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు.
undefined
undefined
click me!