త్వరలో ఏపీలో కొత్త పాలసీ.. భారీగా ఉపాధి కల్పనకు చంద్రబాబు సర్కార్ ప్రణాళిక

Published : Aug 19, 2024, 04:38 PM ISTUpdated : Aug 19, 2024, 04:45 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నూతన టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ తీసుకురానుంది. ఈ కొత్త పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, రాయితీలు అందజేస్తామని మంత్రి ఎస్.సవిత తెలిపారు.  

PREV
13
త్వరలో ఏపీలో కొత్త పాలసీ.. భారీగా ఉపాధి కల్పనకు చంద్రబాబు సర్కార్ ప్రణాళిక

త్వరలో నూతన ఏపీ టెక్స్‌టైల్, అపెరల్ అండ్‌ గార్మెంట్స్ పాలసీ తీసుకు రానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ చేనేత, జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా టెక్స్ టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందుకోసం మౌలిక వసతుల కల్పనతో పాటు రాయితీలు కూడా విరివిరిగా అందజేయనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటులో త్వరతగతిన అనుమతులివ్వనున్నట్లు తెలిపారు. 

23
CM Chandra Babu

టెక్స్‌టైల్‌ రంగంలో పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తుల పెరుగుదలకు నూతన ఏపీ టెక్స్ టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 2018-23 ఏపీ టెక్స్ టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ పాలసీని పక్కన పడేయడంతో... టెక్స్ టైల్ రంగంలోని నూతన పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. దీనివల్ల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ఉపాధి కల్పనలోనూ ఆ ప్రభావం పడిందన్నారు. 

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగానే టెక్స్ టైల్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీని తీసుకురానున్నట్లు వివరించారు. 2018-23 పాలసీకి మరింత మెరుగులు దిద్ది కొత్త పాలసీని తీసుకు రానున్నట్లు చెప్పారు. ఇందుకోసమే పెట్టుబడుదారులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో ఇచ్చే సలహాలు సూచనలను నూతన పాలసీలో అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టైక్స్ టైల్ రంగంలో ఉన్న పరిశ్రమల సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

33
Andhra Pradesh ranks second in silk production in the country

ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం

దేశంలో సిల్క్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో, కాటన్ ఉత్పత్తిలో ఆరో స్థానంలో, జనపనార ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉందని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో 9 టెక్స్ టైల్, అపెరల్ పార్కులు ఉన్నాయన్నారు. వాటిలో ఆరు ప్రభుత్వ రంగంలో ఉండగా... మూడు ప్రైవేటు రంగంలో ఉన్నాయన్నారు. 146 మెగా టెక్స్ టైల్ ఇండస్ట్రీలు, 18,500 యూనిట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 15 టెక్నికల్ టెక్స్ టైల్ కంపెనీల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, మూడు ఇండస్ట్రీస్ కారిడార్లు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అగ్రో టెక్స్ టైల్, జియో టెక్స్ టైల్, మొబైల్ టెక్స్ టైల్‌కు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రంలో టెక్స్ టైల్, అపెరల్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సవిత ఆహ్వానం పలికారు. 

టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, టెక్స్ టైల్ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి సవిత పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు పెంచడమే తమ ప్రభుత్వ నూతన పాలసీ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతకుముందు పలువురు స్టేక్ హాల్డర్లు తమ అనుభవాలను, ఆలోచనలను, సూచనలను పంచుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి సవిత.. స్టేక్ హోల్డర్ల ఆలోచనలు, సూచనలు కొత్త పాలసీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories