‘గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్’ ఆంధ్రప్రదేశ్‌... మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకను కాదని మనకే ప్రతిష్టాత్మక అవార్డు

First Published | Aug 18, 2024, 1:14 PM IST

2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌ ‘గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్’ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును కోయంబత్తూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ & సీఈవో డాక్టర్ ఎం. కమలాకర్ బాబు అందుకున్నారు.

 

Andhra Pradesh Wins ‘Green Energy Champion’ Award

తమిళనాడు కోయంబత్తూర్ వేదికగా జరిగిన ఇండియన్ విండ్ పవర్ అసోషియేషన్ మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ కీలక అవార్డును సొంతం చేసుకుంది. 2023- 24 ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ని ‘గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్’గా ఇండియన్ విండ్ పవర్ అసోషియేషన్ గుర్తించింది. ఈ మేరకు అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును విండ్ ఎనర్జీ జాయింట్ సెక్రటరీ లలిత్ బోరా చేతుల మీదుగా ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ MD & CEO డాక్టర్‌ ఎం. కమలాకర్ బాబు అందుకున్నారు. 

Andhra Pradesh Wins ‘Green Energy Champion’ Award

గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్ అవార్డు కోసం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయినప్పటికీ ఉత్తమ పనితీరుతో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించి పురస్కారాన్ని గెలుచుకుంది. కోయంబత్తూర్‌లో అవార్డ్ అందుకున్న అనంతరం ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ కమలాకర్ బాబు మాట్లాడారు. పునరుత్పాదక ఇంధనానికి చంద్రబాబు హయాంలో ఎంతో ప్రాధాన్యం దక్కిందని కొనియాడారు.


CM Chandra Babu

‘2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెన్యూవబుల్ ఎనర్జీకి ఇచ్చిన ప్రాధాన్యతే ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్‌గా నిలబెట్టింది. గతంలో సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవతోనే ఈ ఫలితాలను ఏపీ పొందుతోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రెన్యువబుల్ ఎనర్జీకి పెద్దపీట వేస్తోంది’ అని సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ కమలాకర్ బాబు తెలిపారు.

AP Minister for Energy Gottipati Ravi Kumar

ఏపీ న్యూ రెన్యువబుల్ ఎనర్జీకి అవార్డ్ రావడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తు అభివృద్ధిలో కీలక భూమిక పోషించే రెన్యూవబుల్ ఎనర్జీకి ఏపీ పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.

Latest Videos

click me!