విద్యుత్ షాక్ తో చనిపోతే పరిహారం కాదు... వారిపై చర్యలుంటాయ్..: మంత్రి గొట్టిపాటి వార్నింగ్

Published : Aug 17, 2024, 11:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ ఉన్నతాాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెంట్ షాక్ తో జరుగుతున్న మరణాలపై ఆయన కీలక కామెంట్స్ చేసారు. 

PREV
15
 విద్యుత్ షాక్ తో చనిపోతే పరిహారం కాదు... వారిపై చర్యలుంటాయ్..: మంత్రి గొట్టిపాటి వార్నింగ్
gottipati ravikumar

అమరావతి : వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ షాక్ సమస్య పెరిగిపోతుంది. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడి కొన్నిసార్లు, బాగా తడిసిన స్తంబాల్లో, గోడల్లో విద్యుత్ ప్రసరణ...  ఇలా అనేక విధాలుగా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి వర్షాకాలంలో విద్యుత్ షాక్ లతో మరణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలపై చర్చించేందుకు  మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులు వర్చువల్ సమావేశం నిర్వహించారు. 

25
Gottipati Ravi Kumar

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు విద్యుత్ షాక్ తో చనిపోయిన వారి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ప్రమాదాల కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు విద్యుత్ షాక్ తో చనిపోయిన వారు ఎలా మరణించారో రిపోర్టు తయారు చేయాలని పేర్కొన్నారు. అధిక ప్రాణ నష్టం ఏ విధంగా జరుగుతుందో అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు మంత్రి గొట్టిపాటి. 

35
Gottipati Ravi Kumar

భూమి దగ్గర కరెంట్ వైర్లు వేలాడటం వలన చాలామంది ప్రజలే కాదు సిబ్బంది కూడా షాక్ కు గురయి చనిపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. కాబట్టి రాష్ట్ వ్యాప్తంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని రవికుమార్ ఆదేశించారు. 

45
Gottipati Ravi Kumar

విద్యుత్ లైన్ల మరమ్మతులపై ప్రత్యేకంగా దృష్టి సారించి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తర్వాతి సమీక్షా సమావేశం నాటికి అధికారులందరు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సమస్యను తక్షణనే పరిష్కారానికి చొరవ చూపాలని... అలాకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  
 

55
Gottipati Ravi Kumar


విద్యుత్ షాక్ తో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదు... అసలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వం తమదని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం నష్టపోయిన ప్రతీ కుటుంబానికి న్యాయం చేస్తుందని  గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
 

click me!

Recommended Stories