టిడిపితో పొత్తు తర్వాత పవన్ ఫస్ట్ వారాహి యాత్ర... నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Oct 01, 2023, 09:41 AM ISTUpdated : Oct 01, 2023, 09:43 AM IST

పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర నేటినుండి ప్రారంభంకానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

PREV
16
టిడిపితో పొత్తు తర్వాత పవన్ ఫస్ట్ వారాహి యాత్ర... నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan

అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు సిద్దమయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్, టిడిపితో జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత జరుగుతున్న ఈ వారాహి యాత్రపై రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జనసేనాని వారాహి యాత్రలో టిడిపి శ్రేణులు పాల్గొనాలని ఇప్పటికే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. నిన్న నంద్యాలలో జరిగిన టిడిపి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ వారాహి యాత్రకు టిడిపి శ్రేణులు సంపూర్ణ సహకారం అందించాలని నిర్ణయించారు. ఇలా జనసేన, టిడిపి శ్రేణులు పాల్గొననున్న ఈ వారాహి యాత్రపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 
 

26
Pawan Kalyan

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పవన్ వారాహి యాత్రకు సైకో జగన్ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించవచ్చని లోకేష్ అన్నారు. నాలుగో విడత వారాహి యాత్ర సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించనున్న బహిరంగ సభను ప్రభుత్వం ఏదోలా అడ్డుకోవాలని చూస్తోందన్నారు. కాబట్టి సైకో సర్కార్ ప్రయత్నాలను తిప్పికొట్టాలని.... పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని లోకేష్ సూచించారు. మొత్తంగా కృష్ణా జిల్లాలో పవన్ వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని లోకేష్ అన్నారు. 
 

36
Balakrishna

నిన్నటి టిడిపి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... టిడిపి-జనసేన పొత్తు ఇప్పటికే ఖరారయి ప్రకటన కూడా చేసామన్నారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు కలిసి ముందుకు వెళతాయని... ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఇందులో భాగంగానే నాలుగో విడత వారాహి యాత్రకు టిడిపి సంపూర్ణ మద్దతు ఇస్తోందని... పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కల్యాణ్ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. జనసేన, టిడిపి నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే బాలకృష్ణ సూచించారు. 
 

46
Varahi campaign

ఇలా జనసేన, టిడిపి శ్రేణులు వెంటరాగా ఇవాళ(ఆదివారం) పవన్ వారాహి యాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు అవనిగడ్డలో భారీ బహిరంగసభ సభ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే జనసేన ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. టిడిపితో పొత్తు ఖరారయిన తర్వాత జరుగుతున్న మొదటి వారాహి యాత్ర ఇది. అంతేకాదు చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్న సమయమిది. దీంతో పవన్ యాత్ర ఈ ఆంక్షలను దాటుకుని ఎలా సాగుతుందో అన్న ఆసక్తి  ఇరు పార్టీల్లోనే కాదు ప్రజల్లోనూ నెలకొంది. 

56
varahi

మొత్తంగా కృష్ణాజిల్లాలో ఐదు రోజులపాటు పవన్ పర్యటన కొనసాగనుంది. అవనిగడ్డలో సభ, యాత్ర అనంతరం పవన్ మచిలీపట్నం చేరుకోనున్నారు. రెండో తేదీ కృష్ణాజిల్లా జనసేన నాయకులతో సమావేశం, మూడో తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నాలుగో తేదీన పెడన, ఐదోతేదీన కైకలూరు నియోజకవర్గంలో వారాహి యాత్ర చేపట్టనున్నారు. 

66
Pawan Kalyan

మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని లు పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు... వీరి నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగుతుండం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ పవన్ ఏం మాట్లాడాతారోనని జన సైనికులు, తెలుగు తమ్ముళ్లతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories