Published : Sep 30, 2023, 09:07 PM ISTUpdated : Sep 30, 2023, 09:10 PM IST
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి , తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ‘‘మోత మోగిద్దాం’’ అంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని వారు కోరారు.
ఢిల్లీలో నారా లోకేష్ .. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితర నేతలు గంట కొట్టి, ప్లేటు మోగించి నిరసన తెలియజేశారు.
25
nara brahmani
రాజమండ్రిలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు విజిల్ వేసి డప్పు కొట్టారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళలతో బ్రాహ్మణి ముచ్చటించి ధన్యవాదాలు తెలిపారు.
35
nara brahmani
మోత మోగిద్దాం అనే పిలుపు కేవలం చంద్రబాబుకు మద్ధతు తెలపడం ఒక్కటే కాదని.. న్యాయం జరగాలని కోరుకునే కార్యక్రమం అని పేర్కొన్నారు. న్యాయం గెలవాలి.. న్యాయమే తప్పకుండా గెలుస్తుందని బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు.
45
nara brahmani
తాము ఇచ్చిన పిలుపుకు స్పందించి మోతమోగిద్దాం కార్యక్రమంలో పిలుపులో పాల్గొన్న రాష్ట్ర ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు.
55
nara brahmani
మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప మాట్లాడుతూ... చంద్రబాబును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. లోకేష్ పైనా అక్రమ కేసులు బనాయించారని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.