పీలేరులో రియల్ దందా నిజమే.. సమగ్ర విచారణ జరిపించండి.. సీఎం జగన్ కు ఎమ్మెల్యే చింతల లేఖ

First Published Jul 7, 2021, 11:59 AM IST

తిరుపతి పీలేరు మండలం లోని ప్రభుత్వ పోరంబోకు భూములలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందా పై సమగ్ర విచారణ జరిపించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.  లేక ప్రతిని మంగళవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం అధికారులకు అందజేశారు.  

తిరుపతి పీలేరు మండలం లోని ప్రభుత్వ పోరంబోకు భూములలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందా పై సమగ్ర విచారణ జరిపించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. లేక ప్రతిని మంగళవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం అధికారులకు అందజేశారు. పీలేరు మండలం ఎర్రగుంట్ల పల్లె, గూడ రేవు పల్లె, కాకులారం పల్లె, ముడుపుల వేముల, బోడుమల్లువారిపల్లె పంచాయతీల పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూములు అన్యాక్రాంతం అయ్యాయని లేఖలో వెల్లడించారు.
undefined
పెద్ద ఎత్తున జరిగిన ప్రభుత్వ భూముల కుంభకోణంలో రియల్టర్లు, అధికారులు, కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఈ ఆరు పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములు రూ. వందల కోట్ల ఖరీదు చేసే అత్యంత విలువైనవని పేర్కొన్నారు.ఈ భూముల్లో అక్రమ లే అవుట్లు వేసి ఇళ్ల స్థలాలను అమాయక ప్రజలకు విక్రయించారని వివరించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ భూములను కొనుగోలు చేసి మోసపోయారని వెల్లడించారు. ప్రభుత్వం పోరంబోకు భూములను లే అవుట్లుగా మార్చి ప్లాట్లు వేసి విక్రయించిన వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు.
undefined
ఈ అక్రమాలు 2009 -2014 మధ్య అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ, 2014-19 నడుమ టిడిపి ప్రభుత్వంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వ్యవహరించిన కాలంలోనూ జరిగాయని ఆరోపించారు.అలాగే వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక 2019- 21 మధ్య కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారని టిడిపి నాయకులు ఆరోపించిన విషయాన్ని తన లేఖలో ప్రస్తావించారు. వాటిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని సిఎంను కోరారు.
undefined
2009 నుంచి 2021 వరకు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలని తక్షణం సంబంధిత రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. విచారణ ద్వారా వాస్తవాలను బహిర్గతం చేయడంతో పాటు అక్రమాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న రియల్టర్లు, ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయించాలని విజ్ఞప్తి చేశారు. పీలేరు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేసిన అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు.
undefined
పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూములు భారీగా అన్యాక్రాంతం కావడం, ఆ భూముల్లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరిగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 2009 నుంచి ఇప్పటి వరకు ఈ దందా కొనసాగుతూనే ఉంది. దీనిపై 2009 -14 నడుమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు ఆరోపణలు చేయగా 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. తిరిగి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా టిడిపి నాయకులు భూకబ్జాలు చిట్టా విప్పారు.
undefined
ఆశ్చర్యకరంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా అవే ఆరోపణలు చేస్తూ సమగ్ర విచారణకు ఆదేశించారని సీఎంకు లేఖ రాశారు. 2009 నుంచి 2019 వరకు జరిగిన భూ కబ్జాలపై విచారణ కోరడంలో వింత ఏమీ లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 2019 నుంచి 2020 1 వరకు జరిగిన దంతాలపై ఆయన విచారణ కోరడమే ఇపుడు చర్చనీయాంశం అయింది.
undefined
నిజానికి గత టీడీపీ ప్రభుత్వంలో కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నాయకులు పలువురు వైసిపి లోనే ఉన్నారు. తమ దందా కొనసాగిస్తున్నారు. దీనిపై ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్న వారు గుర్రుగా ఉన్నారు. సరిగ్గా దాన్నే చింతల తనకు అనుకూలంగా మలుచుకుని నట్లు కనిపిస్తోంది. స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యే విచారణకు కోరిన నేపథ్యంలో సీఎం కార్యాలయం ఎలా స్పందిస్తుందో, ఒకవేళ విచారణకు ఆదేశిస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సి ఉంది.
undefined
click me!