కన్నీరు మున్నీరవుతున్న గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు.. చివరి ఫొటో ఇదే...

Published : Feb 21, 2022, 01:54 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ వార్తను తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. 

PREV
19
కన్నీరు మున్నీరవుతున్న గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు.. చివరి ఫొటో ఇదే...
mekapati last pic

నిన్ననే దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మేకపాటి రాత్రి హైదరాబాద్ లోని ఓ పెళ్లి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ గౌతం రెడ్డి సరదాగా తీసుకున్న ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అదే ఆయన చివరి ఫొటో కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

29
Mekapati Goutham Reddy

చెట్టంత కొడుకు క్షణాల్లో కనుమరుగవ్వడంతో తండ్రి రాజమోహన్ రెడ్డి కుప్పకూలిపోయారు. పరామర్శించేవారిని చూసి ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ దృశ్యాలు కలిచివేస్తున్నాయి. 

39

భార్యతో ఓ సందర్భంలో మేకపాటి గౌతమ్‌రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. 

49
Mekapati Goutham Reddy

మేకపాటి భౌతిక కాయం వద్ద విషాదంలో మునిగిపోయిన ఆయన కూతురు. బంధువులు, సన్నిహితులు..మేకపాటి సొంతగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి. ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. మేకపాటి వయస్సు 49 సంవత్సరాలు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యుకెలో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి M.Sc పట్టాను పొందారు. 

59
Mekapati Goutham Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం. ఆయన హఠాన్మరణంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ వార్తను తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. 

69
Mekapati Goutham Reddy

మేకపాటి గౌతమ్ రెడ్డి నుదుటన తిలకం దిద్దుతున్న ఆయన మాతృమూర్తి. చిత్రంలో తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఉన్నారు.

79

తండ్రి మరణంతో ఒక్కసారిగా షాక్ లో ఉన్న కూతురు. మేకపాటికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కుమారుడు విదేశాల్లో ఉన్నందున ఆయన వచ్చిన తరువాత ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

89
Sharmila

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YS Sharmila మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వెళ్లిన షర్మిల వారి కుటుంబాన్ని ఓదార్చారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో భార్య, కూతురిని వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ పలకరించారు. 

99
YS Sharmila

వైఎస్ కుటుంబానికి ఎంతో ఆత్మీయులు మేకపాటి కుటుంబీకులు. ఆయన మరణం తరువాత మొదటగా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చింది వీరి కుటుంబమే. తరువాత జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఎంతో కృషి చేస్తన్నారు మేకపాటి. ఆయన మరణం రాష్ట్రానికే కాదు వైఎస్ కుటుంబానికి తీరని లోటు.

click me!

Recommended Stories