సంక్రాంతి బరిలో బిఆర్ఎస్... ఏపీలో భారీగా కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీలు

First Published Jan 15, 2023, 9:10 AM IST

భారత రాష్ట్ర సమితి పార్టీని ఆంధ్ర ప్రదేశ్ లో బలోపేతం చేయాలని భావిస్తున్న కేసీఆర్ సంక్రాంతి పండగను విజయవంతంగా వాడుకుంటున్నారు. ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీలో భారీ ప్లెక్సీలు వెలిసారు. 

BRS Flexis

అమరావతి :  టీఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దమయ్యారు. అయితే మొదట దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది బిఆర్ఎస్ అదిష్టానం. ఇందుకోసం సంక్రాంతి పండగను ఏపీ బిఆర్ఎెస్ నాయకులు వాడుకుంటున్నారు. 

BRS Flexis

ఏపీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. దీంతో బిఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో మునిగిపోవడమే కాదు పార్టీని కూడా ప్రజలకు దగ్గరచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేస్తూ తమ అధినాయకుడు కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తరపున ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్లెక్సీలు వెలిసాయి. 

BRS Flexis

బిఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించారు. అలాగే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథితో పాటు మరికొందరు నాయకులు కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఇలా ఏపీలో బిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను ప్రారంభించి సంక్రాంతి పండగ వేళ ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారు. 

BRS Flexis

ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో పలుజిల్లాలు, ప్రధాన పట్టణాల్లో భారీ ప్లెక్సీలు వెలిసాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో బిఆర్ఎస్ ప్లెక్సీలు వెలిసారు.  

BRS Flexis

విజయవాడ, గుంటూరు, కడియం, కాకినాడ, కడియం, ముమ్మిడివరం, ముక్కామల, యానాం వంటి ప్రాంతాల్లోనూ బిఆర్ఎస్ ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన భారీ ప్లెక్సీలను ఏపీ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతో ప్రజల్లో భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చ జరుగుతోంది. 

BRS Flexis

ఇక ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా సంక్రాంతి సంబరాలను బిఆర్ఎస్ నిర్వహిస్తోంది. తద్వారా హైదరాబాద్ లో నివాసముంటున్న సెటిలర్లతో పాటు ఆంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయితే ఒకప్పుడు ఆంధ్రోళ్లను అమ్మనా బూతులు తిట్టిన కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసమే కొత్త నాటకానికి తెరతీసారని ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా ఏపీలో బిఆర్ఎస్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. 

BRS Flexis

జనసేన పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరిన తోట చంద్రశేఖర్ రాష్ట్ర బాధ్యతలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్లెక్సీలు, పోస్టర్లతో బిఆర్ఎస్ పార్టీకి ముమ్మర ప్రచారం కల్పిస్తున్నారు. అయితే ఆంధ్రోళ్లను వ్యతిరేకించే పార్టీగా ముద్రపడ్డ టిఆర్ఎస్ నుండి పుట్టిన బిఆర్ఎస్ ను ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

click me!