అమరావతి : నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. దేవాదాయ శాఖ మంత్రితో కలిసి సీఎంను కలిసిన పండితులు స్వామివారి చిత్రపటంతో పాటు టిటిడి, క్యాలెండర్, ప్రసాదం అందించి ఆశీర్వచనం అందించారు. ఈ సంవత్సరం జగన్ కు, ఆయన ప్రభుత్వానికి అంతా మంచే జరగాలని ఆశీర్వదించారు.