ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన, అక్కచెల్లెమ్మలు, అన్నాతమ్ముళ్ళు, అవ్వాతాతలందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని జగన్ వ్యాఖ్యానించారు.