ప్యాకేజీ స్టార్.. దమ్ముంటే.. నన్ను చెప్పుతో కొట్టు.. : పవన్ కు ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్...

Published : May 15, 2023, 01:13 PM ISTUpdated : May 15, 2023, 01:14 PM IST

పవన్ కల్యాణ్ పై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్యాకేజీ స్టారేనని, దమ్ముంటే తన ఊరికి వచ్చి చెప్పుతో కొట్టాలని అన్నారు.

PREV
18
ప్యాకేజీ స్టార్..  దమ్ముంటే.. నన్ను చెప్పుతో కొట్టు.. : పవన్ కు ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్...

అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసిపి నేత కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే.. తనను చెప్పుతో కొట్టాలని సవాలు విసిరారు.  

28

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ కి ముడుపులు అందాయని తెలిపారు. సూట్ కేసులు తీసుకున్నారన్నారు. 

38

గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనని ఎవరైనా ప్యాకేజి స్టార్ అంటే చెప్పుతో కొడతానని చెప్పుకొచ్చారని.. ఇప్పుడు నేను బాహాటంగా ప్యాకేజి స్టార్ అని అంటున్నాను..  పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే చెప్పుతో రావాలని..  తనను కొట్టాలని సవాల్ విసిరారు. తను కోవూరు నడిరోడ్డులో నిలబడతానని..  చెప్పు తీసుకొని వచ్చి తనను కొట్టాలని ఛాలెంజ్ చేశారు.

48

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన..  ఇంకా మిగతా పార్టీలు అందరూ కలిసి వైసిపి మీద యుద్ధం చేస్తారని అంటున్నారని అన్నారు. అసలు జనసేన అనే పార్టీ ఉందా? అని ప్రశ్నించారు.  చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ తన శీలాన్ని అమ్మేశారు. 

58

ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకే తెలుసని ఆరోపణలు గుర్తించారు. చంద్రబాబు నాయుడుని కలిసేందుకు వెళ్లేప్పుడు వెంట నాదెండ్ల మనోహర్ ను కూడా తీసుకువెళ్లాడు.

68

అక్కడే పవన్ కళ్యాణ్ కేవలం డబ్బుల కోసమే జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పెట్టాడని అర్థం అయిపోతుందని విమర్శలు గుర్తించారు. కాపు నాయకులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ప్రసన్న కుమార్ రెడ్డి సూటిగా ఓ ప్రశ్న వేశారు. 

78

రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు కాదా అంటూ అడిగారు.  అది జగమెరిగిన సత్యం అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి కుటుంబంలో పవన్ కళ్యాణ్ చెడ పుట్టాడని అన్నారు. చిరంజీవి ఎంతో పెద్దమనిషి అని.. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినా కూడా హుందాగా ఉన్నారని.. ఆ హుందాతనం పవన్ కళ్యాణ్ లో లేదని ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

88

20, 25 కోట్లకు చంద్రబాబుకి పార్టీని అమ్మేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించాలని రంగాను చంపిన బాబుతో పొత్తులు పెట్టుకుంటావా అంటూ మండిపడ్డారు.ప్రజలు పవన్ కళ్యాణ్ ను క్షమించరు అని హెచ్చరించారు.  జనసేన పార్టీ కార్యకర్తలు,  ఫ్యాన్స్, ప్రజలు పవన్ ను దీనికి క్షమించారని చీదరించుకుంటారని అన్నారు. అంతేకాదు  వైసీపీ అధినేత,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరూ.. ఏమీ పీకలేరని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Read more Photos on
click me!

Recommended Stories