విశాఖ బీచ్‌లో జనసేనాని షికారు... ప్రకృతి ఒడిలో సేదతీరిన పవన్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Nov 12, 2022, 09:37 PM IST

నిత్యం రాజకీయాలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ శనివారం విశాఖలో సరదాగా గడిపారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌, తదితర నేతలతో కలిసి కాపులప్పాడ బీచ్‌ను సందర్శించారు. అలలకు ఎదురుగా నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించారు.  

PREV
16
విశాఖ బీచ్‌లో జనసేనాని షికారు... ప్రకృతి ఒడిలో సేదతీరిన పవన్ (ఫోటోలు)
pawan

కాపులప్పాడ బీచ్‌లో సేదతీరుతున్న జనసేన అధినేత. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారుడితో మాట్లాడుతోన్న  పవన్ కల్యాణ్. పక్కన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. 

26
pawan

కాపులప్పాడ బీచ్‌‌కు వస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయనను కెమెరాలో బంధించేందుకు ఎగబడుతోన్న అభిమానులు, స్థానికులు 

36
pawan

కాపులప్పాడ బీచ్‌లో సేదతీరుతున్న జనసేన అధినేత. ఈ సందర్భంగా ఏదో విషయంపై  పవన్ కల్యాణ్‌కు వివరిస్తోన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. 

46
pawan

విశాఖపట్నం పర్యటనలో వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నగరంలోని రుషికొండను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

56
pawan

ఇటీవల రుషికొండ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని విశాఖను వీడిన వెంటనే స్థానిక జనసేన నేతలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు పవన్. 

66
pawan

కొండపై జరుగుతున్న పనులు ఏంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ వున్న గుట్టపైకెక్కి ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు పవన్. 

Read more Photos on
click me!

Recommended Stories