తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 48 గంటలు వర్షాల పరంగా అత్యంత కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 23 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.