అమరావతికి ఐఐటీ నిపుణులు: చంద్రబాబు విజన్‌కు పరీక్ష.. తేలనున్న రాజధాని భవనాల సామర్థ్యం

First Published | Aug 2, 2024, 8:52 AM IST

ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ నిపుణులు అమరావతిలో నేడు (శుక్రవారం) పర్యటిస్తారు. అసంపూర్తిగా ఉన్న భవనాల సామర్థ్యంపై సమీక్షించనున్నారు.

amaravathi

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా... మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై ఐఐటీ ఇంజినీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది.

2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన వాటి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు ఆంధ్రప్రదేశ్‌కి నేడు (శుక్రవారం) రానున్నారు.ఆయా నిర్మాణాల పటిష్టత,ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటీ ఇంజినీర్లు పరిశీలించనున్నారు. 

Latest Videos


అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్,హెచ్ఓడీ కార్యాలయాల టవర్లతో పాటు హై కోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్‌లతో పునాదులు కూడా వేసింది. అయితే, పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 

Chandra Babu

ఇక ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు శుక్రవారం అమరావతికి రానున్నాయి.

అమరావతి

రెండు బృందాలు రెండు రోజులపాటు (శుక్ర, శనివారాలు) అమరావతిలో పర్యటిస్తాయి. ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. అమరావతి పర్యటనలో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశం కానున్నారు.

click me!