జగన్‌కి అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?

First Published | Jul 29, 2024, 7:00 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. 11 ఛార్జ్ షీట్లు, వివిధ ఆరోపణలు, కోర్టు కేసులు గురించి ప్రస్తావించారు.

ys jagan

అవినీతి సొమ్ముతో ఢిల్లీకి ఎగేసుకుంటూ పోయి అక్కడ జగన్ రెడ్డి అభాసు పాలయ్యాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. జగన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఆయన జగన్ మోహన్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి అని విమర్శించారు. ఆయన 11 ఛార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉండి.. కోర్టులకు హాజరుకు కాకుండా తప్పించుకుంటూ అబద్దాలు చెబుతున్నాడన్నారు. అబద్దాలు చెప్పే జగన్‌కు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దమ్ముంటే 31 రాజకీయ హత్యలు ఎక్కడ జరిగాయో చెప్పాలన్నారు. ఇకనైనా జగన్ రెడ్డి కోర్టులకు హాజరై నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు. 

వర్ల రామయ్య ఇంకా ఏమన్నారంటే?

‘ఢిల్లీ వెళ్లి ఏదో చేయాలని చూసి అభాసు పాలయ్యాడు. జగన్ రెడ్డి పెద్ద అబద్దాలకోరు. ఏ2 ఎక్కడ ఉన్నాడో తెలియదు. సజ్జల ఎటుపోయాడో  తెలియదు. జగన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. 11 కేసుల్లో ఛార్జ్ సీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ జగన్. రూ. 43 వేల కోట్లు కొట్టాశారని సీబీఐనే చెప్పింది. అందుకే 16 నెలలైనా బెయిల్ రాలేదు. జగన్ నేటికీ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి. అబద్దాలతో కోర్టులను మభ్యపెట్టి మాయ చేసి కోర్టులకు వెళ్లకుండా ఎగ్గొట్టి నీతులు వల్లిస్తారా? మీ కంటిలోని దూలాన్ని అట్టేపెట్టుకుని ఎదుటి కంటిలోని నలుసుకోసం పాకులాడుతున్నారా? అధికారం పోయి 50 రోజులు అయినా మీ మీద ఉన్న కేసులపై ఎందుకు కోర్టులకు హాజరు కావడంలేదు జగన్ రెడ్డి?’  


జగన్ రెడ్డిపై ఉన్న 11 ఛార్జ్ షీట్లు

‘31/03/2012లో  రూ. 29 వేల50 కోట్లు అన్యాక్రాంతంగా జగన్ రెడ్డి కంపెనీల్లోకి వచ్చినట్లు సీఐబీ ఫస్ట్ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. 23/04/2012లో పోలేపల్లి సెజ్ లో భూములను అరబిందో, హెటిరో సంస్థలకు కేటాయింపుల్లో రూ. 66 కోట్ల 30 లక్షలు అన్యాక్రాంతంగా వచ్చినట్లు రెండో ఛార్జ్ షీట్ వేసింది. జగతి పబ్లికేషన్ లో రూ.9 కోట్ల 99 లక్షలు అక్రమంగా పెట్టుబడులు వచ్చినట్లు 07/05/2012 మూడో ఛార్జ్ షీట్ వేశారు. విశాఖలో రాంకీకి భూములు ఇస్తే ఆయన పదికోట్లు అక్రమ పెట్టుబడులు పెట్టాడు. 31/ 08/2012 నాలుగో ఛార్జ్ షీట్ రూ.854 కోట్లు మీ కంపెనీలో పెట్టారని  28 వేల ఎకరాలను నిమ్మగడ్డ ప్రసాద్‌కు కట్టబెట్టారు. 08/04/2013లో జగన్ కంపెనీల్లో రూ. 205 కోట్ల అన్యాక్రాంత పెట్టుబడులు వచ్చినట్లు ఐదో ఛార్జ్ షీట్ వేశారు. 10/09/2013న ఆరో ఛార్జ్ షీట్ రంగారెడ్డి జిల్లాలో ఇండియా సిమెంట్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా నీటిని కేటాయించినందుకు మీ కంపెనీలో అక్రమ పెట్టుబడులు పెట్టారు. 10/09/2013 ఏడో ఛార్జ్ షీట్ 10,030 ఎకరాల సున్నపురాయిని అక్రమంగా భారతీ సిమెంట్స్ కు కేటాయించారు. 10/09/2013లో 8వ ఛార్జ్ షీట్ తాడిపత్రిలో 231 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా పెన్నాగ్రూపుకు కేటాయంచినందుకు వారు మీకు ఇచ్చిన నజరానా 68 కోట్లు. 17/09/2013న 9వ ఛార్జ్ షీట్  శంషాబాద్‌లో అక్రమంగా హిందూ టెక్ కంపెనీకి 250 ఎకరాలు అక్రమ భూ కేటాయింపులకు జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులు రూ. 15 కోట్లు. 17/0/2013న 10వ ఛార్జ్ షీట్ లేపాక్షి హబ్ కు అక్రమ భూమి కేటాయింపులు... జగన్ కంపెనీల్లో రూ. 50 కోట్లు అక్రమ పెట్టుబడులు. 17/09/2013న 11వ ఛార్జ్ షీట్ హిందూ గ్రూప్ కు హౌసింగ్ స్కీమ్ తో జగన్ కంపెనీల్లో 70 కోట్లు పెట్టుబడులు తీసుకున్నారు. ఇన్ని ఛార్జ్ షీట్లు ఉండి, ఇన్ని అబద్దాలు మాట్లాడే జగన్‌కు అసలు మాట్లాడే నౌతిక హక్కు లేదు. రాష్ట్రం కూటమి పాలనలో ప్రశాతంగా ఉంది. చంద్రబాబు పాలనలో పోలీసు వ్యవస్థ న్యాయంగా వెళుతుంది. జగన్ రెడ్డి క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లాలి. కోర్టులో నిర్థోషిత్వాన్ని నిరూపించుకోవాలి. సామాన్యులు విచారణకు రాకుండా ఉంటే చట్టం ఊరుకుంటుందా... అలాగే జగన్ రెడ్డి కేసులను న్యాయస్థానం సమీక్షించి చర్యలు తీసుకోవాలి.'

న్యాయస్థానాల వ్యాఖ్యలు నిజం కాదా?

‘జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం జరుగుతోంది? ముఖ్యమంత్రి కాబట్టే ఆలస్యమా? సీఎం అయితే హాజరు మినహాయింపు అడుగుతారా? ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు. విచారణ సవ్యంగా జరుగుతుంటే సమస్యలెందుకు వస్తాయి. సీబీఐ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి.. జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.
•    రూ.43వేల కోట్ల మొత్తం దుర్వినియోగమైందని ఆరోపణలున్న అక్రమాస్తుల కేసు ప్రజాధనంతో ముడిపడి ఉంది. నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సమాజ విశాల ప్రయోజనాలే ముఖ్యం. కేసులో సాక్ష్యులను ప్రభావితం చేయడానికి ఆధారాలను తారుమారు చేయడానికి అవకాశం ఉందని సీబీఐ వాదిస్తోంది. కేసు విచారణ ముగిసేంత వరకు జగన్ బెయిల్ పొందలేరు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన అంశాలకు బెయిల్ కు సంబంధం లేదని 04.07.2012న జగన్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు
•    ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? 14-09-2012 న సుప్రీంకోర్టు వ్యాఖ్య.. ఒక వ్యక్తి కేవలం పదేళలో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు. దర్యాప్తు పూర్తయ్యేదాకా బెయిల్ సాధ్యం కాదు 05-10-2012 న జగన్ బెయిల్ పిషన్ ను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య
•    అక్రమాస్తుల కేసుల్లో గైరాజరుకు ప్రథమ నిందితుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి వారం ఏదో ఒక కారణం చెబుతున్నారు. కేసు తదుపరి విచారణ జరిగే 31వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలి, లేకపోతే తగిన ఉత్తర్వులు జారీచేస్తాం. తప్పనిసరిగా రావాలని ఆదేశిస్తే తప్ప జగన్ హాజరు కావడం లేదు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటులో కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే..’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Latest Videos

click me!