అమరావతి : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు అదే రాజమండ్రి జైలువద్ద ప్రకటించారు. ఇలా చంద్రబాబు అరెస్ట్ తో టిడిపికి చెక్ పెట్టాలని వైసిపి భావిస్తే... టిడిపి, జనసేన పొత్తు ఖరారు చేసుకుని అధికార పార్టీకే కౌంటర్ ఇచ్చారు. ఇలా ఏపీ పాలిటిక్స్ ఎత్తులు, పైఎత్తులతో రసవత్తరంగా సాగుతున్నాయి.