School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!

Published : Oct 17, 2026, 09:05 PM ISTUpdated : Oct 17, 2026, 09:14 PM IST

దసరా సెలవులు ముగిశాక కూడా ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు రానున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఏకంగా నాల్రోజులు సెలవులు వచ్చే అవకాశాలున్నాయి.

PREV
15
తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు

దసరా సెలవుల్లో చాలామంది విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ సెలవులు ముగిసి పాఠశాలలు మళ్లీ తెరుచుకోగానే వెళ్లాలంటే బాధ కలుగుతుంది. అయితే ఈసారి తెలుగు విద్యార్థులకు అలాంటి బాధ ఉండకపోవచ్చు... దసరా సెలవులు ముగిశాక కూడా వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దసరా 12 రోజులు సెలవులు ఇచ్చారుగా… మళ్లీ ఎందుకు సెలవులు రానున్నాయి? అనేగా మీ డౌట్. ఈ స్పెషల్ హాలిడేస్ ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

25
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది… అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది... ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 28న పోలింగ్ జరగనుంది.

అయితే పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లోనే ఏర్పాటుచేయనున్నారు. అందుకే పోలింగ్ జరిగే నగరాలు, పట్టణాల్లో అక్టోబర్ 27, 28 తేదీల్లో అధికారిక సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధులకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు, పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి.

అయితే ఈ సెలవులు అందరు విద్యార్థులకు ఉండవు.. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసే స్కూల్ విద్యార్థులకే వర్తిస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు సెలవు ఉందో, లేదో తెలియాలంటే ఆ స్కూల్లో పోలింగ్ కేంద్రం ఉందో, లేదో తెలుసుకోవడం మంచింది. స్కూల్ సిబ్బంది కూడా ముందుగానే సెలవు సమాచారం ఇస్తారు.

35
అక్టోబర్ 25, 26 తేదీల్లోనూ సెలవులు?

అక్టోబర్ 25 ఆదివారం కావడంతో సాధారణంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక అక్టోబర్ 26న వాల్మీకి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని విద్యాసంస్థలకు కూడా సెలవు ఉండే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వాల్మీకి జయంతి సెలవు వర్తిస్తుందని భావించకూడదు. ఆయా విద్యాసంస్థలు ప్రకటించే సెలవుల జాబితాను పరిశీలించాలి.

45
వరుసగా నాలుగు రోజుల సెలవులేనా?

ఆదివారం సాధారణ సెలవు, సోమవారం వాల్మీకి జయంతి సెలవు ఉండే అవకాశం, ఎన్నికల నేపథ్యంలో మంగళ, బుధవారం సెలవులు. ఇలా ఒకదాని వెంట ఒకటి రావడంతో విద్యార్థులకు వరుసగా నాలుగు రోజుల విరామం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల కోసం సెలవులు ప్రకటించిన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇది ఊరటనివ్వనుంది. దసరా సెలవులు ముగిసిన వెంటనే మళ్లీ కొంత విరామం దొరకడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉంది.

అయితే అక్టోబర్ 26న సెలవు విషయంలో పాఠశాలల వారీగా మార్పులు ఉండవచ్చు. అందువల్ల వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉంటాయని నిర్ధారించుకునేందుకు విద్యార్థులు తమ పాఠశాల యాజమాన్యం నుంచి సమాచారం తెలుసుకోవాలి.

55
ఉద్యోగులకు సెలవే

మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో అక్టోబర్ 28న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు కలిగిన ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలకు కూడా ప్రభుత్వం సూచించింది.

మొత్తంగా దసరా సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా ఎన్నికల కారణంగా కొన్ని విద్యాసంస్థలకు మరోసారి సెలవులు రానున్నాయి. అయితే ఏయే పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు వర్తిస్తాయనే విషయంపై సంబంధిత పాఠశాలలు, అధికారుల నుంచి వచ్చే ప్రకటనలను గమనించడం అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories