దేశంలోనే అతిపొడవైన గ్లాస్ స్కైవాక్.. మన తెలుగు రాష్ట్రంలోనే. 262 మీటర్ల ఎత్తులో అదిరిపోయే థ్రిల్

Published : Dec 03, 2025, 10:12 AM IST

Glass skywalk: ఆకాశంలో గ్లాస్‌పై న‌డుస్తుంటే.. ఓవైపు భ‌యం, మ‌రోవైపు థ్రిల్‌. ఇలాంటి అనుభూతి చెందాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే విదేశాల్లోనే ఎక్కువ‌గా క‌నిపించే ఈ అనుభూతి ఇప్పుడు మ‌న తెలుగు ప్ర‌జ‌ల‌కు కూడా ల‌భించింది. 

PREV
15
కైలాసగిరిపై నూతన ఆకర్షణ – గ్లాస్ స్కైవాక్ ప్రారంభం

విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో భారతదేశంలోనే అతిపొడవైన గ్లాస్ స్కైవాక్‌ను VMRDA అధికారికంగా ప్రారంభించింది. ఈ అద్భుత‌మైన గ్లాస్ స్కైవాక్‌ను విశాఖ ఎంపీ శ్రీభరత్, మేయర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇది పర్యాటక రంగంలో విజాగ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చే ఆకర్షణగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

25
862 అడుగుల ఎత్తులో

862 అడుగుల ఎత్తు నుంచి సముద్రతీర నగరం విశాఖపట్నం న‌గరం, స‌ముద్రంతో పాటు చుట్టూ ఉన్న కొండలు ఇవన్నీ ఒకే చోట కనిపించే అరుదైన అవకాశం ఈ స్కైవాక్ ఇస్తుంది. ఇక్కడి నుంచి కనిపించే పానోరమిక్ వ్యూ పర్యాటకులకు, స్థానికులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

35
కాంటిలీవర్ ఇంజనీరింగ్

స్కైవాక్‌ను కాంటిలీవర్ నిర్మాణంగా రూపొందించారు. ఇది కొండ అంచు నుంచి ముందుకు చేప‌ట్టిన‌ బలమైన నిర్మాణం. గాలి, బరువు, ఒత్తిడిని తట్టుకునేలా ప్రత్యేక ఇంజనీరింగ్‌తో దీనిని నిర్మించారు. 250 కిమీ వేగంతో వీచే గాలులకు కూడా ఇది తట్టుకునేలా దీనిని ప‌రీక్షించారు.

45
సందర్శకులకు స‌రికొత్త అనుభవం

ప్రతి అడుగులోనూ అడుగుల కింద కనిపించే లోతు… చుట్టూ అద్భుత దృశ్యాలు… మబ్బుల మీద నడుస్తున్న అనుభూతి… ఇవన్నీ ఈ గ్లాస్ స్కైవాక్ ప్రత్యేకత. గాజు బలంగా తయారు చేయ‌డంతో సందర్శకులు భద్రంగా నడవొచ్చు. ఒకేసారి 100 మంది నిలబడగలిగినా, కేవలం 40 మందికి మాత్రమే అనుమతించడం ద్వారా సేఫ్టీ, కంఫర్ట్‌ను కాపాడుతున్నారు.

55
టూరిజానికి భారీ ఊతం

ఏడు నుంచి ఎనిమిది నెలల్లో నిర్మాణం పూర్తయిన ఈ ప్రాజెక్ట్, కైలాసగిరి పర్యాటక ప్రాధాన్యం మరింత పెంచింది. విశాఖను సందర్శించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన కొత్త ల్యాండ్‌మార్క్‌గా ఇది మారుతోంది. అత్యంత బ‌ల‌మైన గాజుతో చేసిన ఈ నిర్మాణం, భద్రతను కాపాడుతూ సందర్శకులకు మర్చిపోలేని అనుభవం ఇస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories