విజయసాయి, అవంతి భయాలు అవే: గంటా వైసిపీలోకి వస్తే...

First Published Aug 8, 2020, 5:33 PM IST

కరోనా వైరస్ ఒక పక్కనుండి వణికిస్తున్న ప్పటికీ, మూడు రాజధానుల అంశం మొత్తం పొలిటికల్ స్పేస్ నే ఆక్రమిస్తున్నప్పటికీ... ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వీటన్నిటితోపాటుగా మరో అంశం కూడా కాకరేపుతోంది. అదే గంటా శ్రీనివాసరావు అంశం. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికీ రాజకీయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నఔత్సాహికులను నిరాశపరచవు. ఏ సమయంలో అయినా రాజకీయాలు చప్పగా ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతానికి మూడు రాజధానుల అంశం ప్రకంపనలు పుట్టిస్తున్నప్పటికీ... మరికొన్ని అంశాలు కూడా కాక రేపుతూనే ఉన్నాయి.
undefined
కరోనా వైరస్ ఒక పక్కనుండి వణికిస్తున్న ప్పటికీ,మూడు రాజధానుల అంశం మొత్తం పొలిటికల్ స్పేస్ నే ఆక్రమిస్తున్నప్పటికీ... ఉత్తరాంధ్ర రాజకీయాల్లోవీటన్నిటితోపాటుగా మరో అంశం కూడా కాకరేపుతోంది. అదే గంటా శ్రీనివాసరావు అంశం.
undefined
గంటాశ్రీనివాసరావు వైసీపీలో చేరతారు అనే వార్త బయటకు వచ్చినప్పటినుండి విశాఖ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గంటా శ్రీనివాసరావు పై అవంతి, విజయసాయి రెడ్డి ఆరోపణలు చేయడంతో మొదలైన ప్రకంపనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.
undefined
గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీలో చేరడం పక్కాఅనే విషయం తేలిపోయింది. కరోనా సోకి విజయసాయి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సజ్జల రామకృష్ణ రెడ్డి ద్వారా రాయబారం నడిపి జగన్ తో ఓకే అనిపించుకున్నాడు. విజయవాడలో జగన్ సమక్షంలో చేరనున్నారు గంటా.
undefined
తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అవంతి శ్రీనివాసరావు విమర్శించారు.అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారన్నారని ఆయన ఆరోపించారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని, తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోనేందుకు దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
undefined
ఇక ఆ తరువాత కూడా అవంతి శ్రీనివాస్ తన చివరి ప్రయత్నాలను చేస్తున్నాడు. భీమిలి నుంచి మొదలుకొని విశాఖ వరకు గంటా రాకను వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీస్తున్నారు. గంటా అవినీతి పరుడంటూ వారు అనేక నినాదాలిస్తూ మినీ యాత్రలు చేయడం అక్కడ నిత్యకృత్యంగా మారింది.
undefined
అంతేకాకుండా మంత్రిగా ఉన్నప్పుడు గంటా తమను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురిచేశారని విషయాన్నీ వారు మీడియా ముఖంగా పదే పదే చెప్పిస్తున్నారు.నాడు మంత్రిగా ఉన్న గంటా... చిన్నాపురం జంక్షన్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూలగొట్టించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆయనతోపాటు అనుచరవర్గం పలు అక్రమాలకు పాల్పడ్డారని, భూ కబ్జాలు చేశారని వారు ఆరోపిస్తున్నారు.
undefined
గంటాను పార్టీలో చేర్చుకోవద్దంటూ ధర్నాలు, మానవహారాలు చేపట్టారు. ‘అవినీతిపరుడు గంటా మాకొద్దు’, ‘భూకబ్జాదారులను తీసుకోవద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాలను చేబడుతున్నది స్థానిక నాయకులేఅయినప్పటికీ వెనుక ఉన్నదీ మాత్రం అవంతి శ్రీనివాస్ అనేది అందరూ అంటున్న మాట.
undefined
ఉత్తరాంధ్రలో గంటా ఒక సీనియర్ నాయకుడు. సామాజికవర్గ అండ కూడా బలంగా ఉంది. 199 నుండి పోటీ చేసినప్పుడల్లా గెలుస్తూ వచ్చాడు. నాడు అవంతి, గంటా ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగారు కూడా. మొన్నటివరకు టీడీపీలోనే ఇద్దరు ఉన్నారు.
undefined
భీమిలి టికెట్ కావాలని అవంతి కోరడం, 2014లో అక్కడ నుండి గెలిచింది గంటా అవడం, ఆ సీటుపై చంద్రబాబు ఎటు తేల్చకపోవడంతో.... అవంతి వైసీపీలో చేరి అక్కడి నుండి గెలుపొందారు. విశాఖ నార్త్ నుంచి గంటా గెలుపొందారు. మొన్నటి వరకు మిత్రులుగానే కొనసాగారు అవంతి, గంటా. ఇప్పుడు మాత్రం బద్ద శతృవుల్లాగా, గంటా అవంతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
undefined
గంటా గనుక వైసీపీలో చేరితే ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే ఆస్కారం ఉంది. గంటా లాంటి వారు ఇప్పటికే అనకాపల్లి నుంచి విశాఖ సిటీ వరకు అనేక సీట్లలో గెలుపొందారు. ఆయన వస్తే ఇప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అవంతి, విజయసాయి రెడ్ల ప్రాముఖ్యం ఈ ప్రాంతంలో తగ్గవచ్చు అని వీరు భావిస్తున్నారు. అందుకే ఈ చివరాఖరు ప్రయత్నాలను చేస్తున్నారు.
undefined
click me!