అమరావతిపై చంద్రబాబు కొత్త వ్యూహం: జగన్ కు రాయలసీమ చిచ్చు

First Published Aug 7, 2020, 6:07 PM IST

టీడీపీకి ఒకరకంగా ఈ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర లభించడం షాక్ అనే చెప్పవచ్చు. షాక్ తగలడంతో టీడీపీ అమరావతి రైతులతో కలిసి న్యాయపోరాటం అంటూనే జగన్ సర్కార్ పై మరో అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానుల అంశం కలిగిస్తున్న ప్రకంపనలు అన్ని ఇన్నీ కావు. మూడు రాజధానుల ఏర్పాటుపై అమరావతి ప్రాంతవాసులు తీవ్ర నిరసన తెలుపుతుంటే, మూడు రాజధానుల బిల్లు పై గవర్నర్ సంతకం చేయడం టీడీపీకి ఊహించనిపరిణామంగా చెప్పవచ్చు.
undefined
కేంద్రం ఈ విషయాన్నీ నానుస్తుందనుకున్న టీడీపీకి ఒకరకంగా ఈ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర లభించడం షాక్ అనే చెప్పవచ్చు. షాక్ తగలడంతో టీడీపీ అమరావతి రైతులతో కలిసి న్యాయపోరాటం అంటూనే జగన్ సర్కార్ పై మరో అస్త్రాన్ని ఎక్కుపెట్టింది.
undefined
నేటి ఉదయం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై రాయలసీమ ప్రాంతానికి చెందిన నేత భూమా అఖిలప్రియ తీవ్ర ఆరోపణలు చేసారు. ఆమె జగన్ సర్కార్ పై ఫైర్ అవుతూ... రాయలసీమ ప్రాంతానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఆమె వివరించారు. రాయలసీమకు జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల వాళ్ళ కూడా అన్యాయమే జరిగిందని ఆమె ఆక్షేపించారు.
undefined
మూడు రాజధానుల్లో కర్నూల్ ను న్యాయరాజధానిగా పేర్కొంటూ అక్కడ హై కోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాన్ని అన్ని పార్టీలకు అతీతంగా నాయకులంతా స్వాగతించారు. అఖిల ప్రియ ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ... మూడు రాజధానుల వల్ల రాయలసీమ ప్రాంతానికే అధిక నష్టమని అన్నారు.
undefined
రాయలసీమకు న్యాయరాజధాని అంటూ, హై కోర్టు ఇచ్చినట్టే ఇచ్చి విశాఖలో అమరావతిలో హై కోర్టు బెంచులను ఏర్పాటు చేయడమేమిటనిఆమె ప్రశ్నించారు. రాయలసీమ అంటేనే వెనకబడ్డ ప్రాంతమని, ఈ మూడు రాజధానుల ఏర్పాటు వల్ల మరింత వెనుకబడ్డ ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోతుందని ఆమె ఆక్షేపించారు.
undefined
రాయలసీమ ప్రాంత విద్యార్థులు, మేధావులు, లాయర్లు అందరూ కూడా కర్నూల్ లో హై కోర్ట్ ను కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ హై కోర్టును గనుక ఏర్పాటు చేస్తే... అయిపోతుందని భావించాడు జగన్ మోహన్ రెడ్డి. కాకపోతే అమరావతలోనే రాజధాని ఉండిఉంటే, అప్పుడు కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసి ఉంటే రాయలసీమ ప్రాంతం వారికి మరింతగా లాభం నెలకొనేది.
undefined
వాస్తవానికి కూడా రాయలసీమకు ఒక హై కోర్టు ఇస్తే అక్కడకు వెళ్ళేది కొన్ని వందల మంది లాయర్ల కుటుంబాలు, పదుల సంఖ్యలో జడ్జిల కుటుంబాలు. అంతే తప్ప అక్కడ ప్రజలెవరూ సెటిల్ అవ్వరు.కేసులు ఉన్నప్పుడు అక్కడకు ఆ సదరు కేసుకు సంబంధించిన వ్యక్తులు వచ్చి పోతుంటారు తప్ప వారు అక్కడ స్థిర నివాసాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోరు కదా. ఈ లెక్కన అక్కడ లాభపడేది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఓయో, మేక్ మై ట్రిప్ వంటి హోటల్ బుకింగ్ సైట్లే తప్ప అక్కడి స్థానికులకు పెద్దగా ఒరిగేది మాత్రం ఏమి ఉండదు.
undefined
ఇక రాయలసీమలో మాత్రమే హై కోర్టు కాకుండా... ఈ హై కోర్టుకు అమరావతిలో, విశాఖపట్నంలో మల్లి బెంచులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసులు కూడా అప్పుడు కర్నూల్ వరకు రావు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంత వాసులకు హై కోర్టు ఇచ్చినా పెద్దగా ఒరిగేది ఏమి లేదు.
undefined
విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా గనుక కొనసాగితే... ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో అభివృద్ధి మరింతగా కేంద్రీకృతమవుతుంది. అమరావతిలో అభివృద్ధంతా కేంద్రీకృతమవుతుందని ఏ విధంగా అప్పటి ప్రతిపక్షం వైసీపీ గగ్గోలు పెట్టిందో... ఇప్పుడు విశాఖపట్నం వల్ల కూడా అలానే అభివృద్ధి కేంద్రీకృతమవుతుంది. రెండు సందర్భాల్లోనూ.. తాము నష్టపోయామనే భావన మాత్రం సీమ ప్రజలను వెంటాడుతుంది.
undefined
ఈ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు అయినా చేయండి, లేదంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెరతీస్తామని ఇప్పటికే రాయలసీమ ప్రాంత నాయకులు లేఖాస్త్రాలు సంధించారు. బీజేపీ నేతలు సైతం దీనికి గతంలో సహకరించారు.
undefined
ఇప్పటికే జిల్లాల విభజనకు సంబంధించి, తమను కర్ణాటకతోనయినా, తమిళనాడుతోనయినాకలపండి అనే వాదన తెర మీదకు తీసుకొస్తున్నారు.ఇంకో అడుగు ముందుకేసి టీజీ వెంకటేష్ రాయలసీమ విక్టిమ్ కార్డును ప్లే చేసాడు. విశాఖను రాజధానిగా చేసి, దాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే ఆ తరువాత హైదరాబాద్ నుండి వెళ్లగొట్టినట్టు మళ్ళీ సీమ ప్రజలను అక్కడి నుండి మెడలు పట్టుకొని వెళ్ళగొట్టారని గ్యారంటీ ఏంటని ఆయన గతంలోనేప్రశ్నించాడు?
undefined
రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే ఒక భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రాజధాని మార్పు అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీపావులు కదుపుతుంది. జగన్ రాజధానిని మార్చడంవల్లరాయలసీమకు అన్యాయం చేశారని టీడీపీగలాన్నెత్తుకోబోతుంది.
undefined
ఈ వాణిమొదలయితే బీజేపీ సైతం దీనికి వాయిస్ అందించడం తథ్యం.జగన్ కు వారు సహకారం అందిస్తున్నట్టుగానే మరోపక్క రాయలసీమ వ్యూహంరూపంలో టీడీపీకి కూడా దగ్గరగానే ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చే వీలుంటుంది బీజేపీకి.
undefined
ఏది ఏమైనా రానున్న కాలంలో రాయలసీమ వాయిస్ మరింత బలంగా వినిపించడంతోపాటుగా, వారికి అన్యాయం జరిగిందంటూపైకెత్తుకుంటారనడంలోఎటువంటి సంశయం లేదు. ఇది ఇప్పుడు జగన్ పై టీడీపీ ప్రయోగించబోతున్న నూతన అస్త్రం అనేది కూడా తథ్యం.
undefined
click me!