ఇలా హాస్పిటల్ పాలయిన 27మంది విద్యార్థుల్లో కొందరి పరిస్థితి మెరుగుపడగా... ఇంకా కొందరి పరిస్థితి పూర్తిగా విషమించింది. ఇలా ఆరోగ్యం విషమించి జాషువా, భవాని, శ్రద్ద, నిత్య ప్రాణాలు కోల్పోయారు. మిగతా విద్యార్థులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇంకెవరికీ ప్రాణాపాయం జరక్కుండా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.రెండు రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకున్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.