విజయనగరం టీడీపీలో పంచాయితీ: ఆశోక్‌తో అమీతుమీకి గీత రెడీ

First Published | Dec 25, 2020, 2:25 PM IST

టీడీపీ విజయనగరం జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ విషయంలో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకొంది. అయితే పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదని మీసాల గీత  చెబుతున్నారు. 

టీడీపీకి చెందిన విజయనగరం జిల్లా నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ అధిష్టానం సూచన మేరకు తాను ఏర్పాటు చేసిన కార్యాలయానికి బోర్డును తీసేసిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మరోసారి పార్టీ బోర్డును ఏర్పాటు చేయడం టీడీపీలో చర్చకు దారి తీసింది.
undefined
విజయనగరం జిల్లా టీడీపీ వ్యవహరాల్లో మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు చెప్పినట్టే సాగుతోంది. కొంతకాలంగా ఆశోక్ గజపతిరాజుకు మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు మధ్య అంతరం పెరిగినట్టుగా కన్పిస్తోంది.
undefined

Latest Videos


విజయనగరంలో టీడీపీ కార్యాలయం మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు బంగ్లాలో ఉంది. ఈ కార్యాలయాన్ని కాదని మీసాల గీత పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేతో పాటు కొందరు టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
undefined
ఈ విషయమై ఆశోక్ గజపతిరాజు వర్గీయులు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.విజయనగరంలో కొత్తగా పార్టీ కార్యాలయం విషయమై పార్టీ నేతల మధ్య విభేదాలపై చర్చించాలని చంద్రబాబునాయుడు అచ్చెన్నాయుడుకు సూచించారు.
undefined
అచ్చెన్నాయుడు సూచన మేరకు విజయనగరంలో ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయానికి మీసాల గీత వర్గీయులు బోర్డును తొలగించారు.
undefined
ఆశోక్ గజపతిరాజు బంగ్లాలో కాకుండా కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయిస్తానని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని మీసాల గీత చెబుతున్నారు. ఈ హమీని పార్టీ నాయకత్వం నిలుపుకోలేదు. దీంతో మరోసారి పార్టీ కార్యాలయానికి మీసాల గీత బోర్డును ఏర్పాటు చేశారు.
undefined
పార్టీని వీడేందుకే అధిష్టానం చేసిన సూచనలను కూడ పట్టించుకోకుండా మీసాల గీత కొత్త పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని ఆశోక్ గజపతి రాజు వర్గం ఆరోపిస్తోంది.
undefined
అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీని నిలుపుకోకపోవడంతో మీసాల గీత మరోసారి పార్టీ కార్యాలయానికి పార్టీ కార్యాలయం బోర్డును ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం విషయంలో నాయకత్వం ఇచ్చిన హామీని నిలుపుకోకపోవడంతో పార్టీ కార్యాలయానికి బోర్డు ఏర్పాటు చేసినట్టుగా మీసాల గీత తెలిపారు.
undefined
2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గీతను కాదని విజయనగరం నుండి ఆశోక్ గజపతి రాజు కూతురికి చంద్రబాబు అసెంబ్లీ టికెట్టు కేటాయించారు. అయితే ఈ స్థానం నుండి పోటీ చేసిన ఆశోక్ గజపతి రాజు కూతురు ఎన్నికల్లో ఓటమి పాలైంది.
undefined
కొంత కాలంగా తనకు పార్టీ కార్యక్రమాల గురించి సమాచారం రావడం లేదని మీసాల గీత ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.
undefined
click me!