కార్యకర్తలకోసం ఎవరినైనా ఎదిరిస్తా: బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలనం

First Published May 15, 2023, 9:17 PM IST

తాను  వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండే  పోటీ చేస్తానని  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  స్పష్టం  చేశారు.  

కార్యకర్తలకోసం ఎవరినైనా ఎదిరిస్తా

 పార్టీలో  సీఎం  జగన్ ను మినహా  ఎవరిని కూడా పట్టించుకోనని  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  తేల్చి చెప్పారు.సోమవారంనాడు  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  కార్యకర్తల సమావేశంలో  మాట్లాడారు. గత కొంతకాలంగా   పార్టీలో కొందరు తనను  రాజకీయంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు

కార్యకర్తలకోసం ఎవరినైనా ఎదిరిస్తా

మంత్రివర్గం నుండి తప్పుకున్న తర్వాత  పార్టీ రీజినల్ కోఆర్డినేటర్  గా  బాధ్యతలు  తీసుకున్నారు.   అయితే  ఇటీవల పార్టీ   రీజినల్ కోఆర్డినేటర్  పదవికి కూడా  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  రాజీనామా సమర్పించారు. ఈ విషయమై  సీఎం జగన్   బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు.ఆ తర్వాత రెండు  రోజులకు  ఒంగోలులో మీడియాతో మాట్లాడిన  బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

కార్యకర్తలకోసం ఎవరినైనా ఎదిరిస్తా

తాను ఒంగోలు నుండే  పోటీ చేస్తానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. మార్కాపురం లేదా దర్శి నుండి పోటీ చేస్తానని  ప్రచారం చేస్తున్నారన్నారు. తన రాజకీయ జీవితం  ఒంగోలు నుండే ప్రారంభమైందన్నారు.వచ్చే ఎన్నికల్లో కూడా తాను   ఒంగోలు నుండే పోటీ చేస్తానని  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  స్పష్టం  చేశారు

కార్యకర్తలకోసం ఎవరినైనా ఎదిరిస్తా

కార్యకర్తల కోసం ఎవరినైనా  ఎదిరించేందుకు  తాను  సిద్దంగా  ఉన్నానని  ఆయన తేల్చి చెప్పారు.  కార్యకర్తల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానన్నారు.  కార్యకర్తల  విషయంలో తాను  రాజీపడబోనన్నారు. కార్యకర్తల కోసం అయినవాళ్లను కూడా ఎదిరిస్తానని  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు.

కార్యకర్తలకోసం ఎవరినైనా ఎదిరిస్తా

మంత్రివర్గ విస్తరణలో  ఒంగోలు  జిల్లా నుండి   ఆదిమూలపు సురేష్ కు మరోసారి అవకాశం దక్కింది.  కానీ  బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుహ్యంగా మంత్రి పదవిని కోల్పోయారు.   అయితే  పార్టీ అవసరాల రీత్యా  బాలినేని శ్రీనివాస్ రెడ్డిని   రీజినల్  కోఆర్డినేటర్ గా నియమించారు.  అయితే  పార్టీలోనే  కొందరు  తనపై  పార్టీ నాయకత్వానికి  ఫిర్యాదు  చేస్తున్నారని  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఆరోపించారు. 

click me!