వింతవ్యాధితో ఏలూరువాసి మృతి...సర్కార్ పై చంద్రబాబు, లోకేష్ సీరియస్

First Published Dec 7, 2020, 10:06 AM IST

ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారిలో తాజాగా ఒకరు మరణించారు.

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఉన్నట్టుండి వందలాదిమంది తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి నగరంలోని పడమరవీధి, కొత్తపేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్‌నగర్‌, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. వీరంతా ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
undefined
ఏలూరు వాసుల అస్వస్ధతకు గల కారణాలను డాక్టర్లు ఇప్పటికీ గుర్తించకలేకపోతున్నారు. ఈ వింత వ్యాధి బారిన పడిన వారిలో తాజాగా ఒకరు మరణించారు. ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆదివారం ఉదయం మూర్చ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. ఉదయం నుంచి చికిత్స పొందిన శ్రీధర్ సాయంత్రం చనిపోయారు.
undefined
విషయం తెలియగానే మృతుడు శ్రీధర్ బంధువులు ఆందోళనకు దిగారు. సరయిన వైద్యం అందకపోవడం వలనే అతడు మృతి చెందాడని ఆరోపించారు. అయితే వైద్యులు మాత్రం ఇతర అనారోగ్య సమస్యల కారణాల వల్లే శ్రీధర్ మృతి చెందాడని అంటున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో మిగతా రోగుల పరిస్థితిపై వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.
undefined
వింత వ్యాధితో ఏలూరువాసి మరణించడంపై మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన సూచించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని కోరారు. అలాగే వింతవ్యాధి మరింత ప్రభలకుండా ఏలూరులో పారిశుద్ధ్య, ప్రజారోగ్యం మెరుగుపరచాలని చంద్రబాబు చెప్పారు.
undefined
ఇక ఇప్పటికే ఏలూరులో చికిత్స పొందుతున్న బాధితులకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న ఆయన బాధితులతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా డాక్టర్లను అడిగి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
undefined
అనంతరం లోకేష్ మాట్లాడుతూ... జగన్‌రెడ్డి నిర్లక్ష్య ధోరణితో ఏలూరు ఘటనే నిదర్శనమన్నారు. వీరి పాలనలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. ప్రజలు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని మండిపడ్డారు.
undefined
అంతకు ముందు ''వైద్యారోగ్య‌శాఖా మంత్రి గారూ! ఈ త‌ల్లి ఆక్రంద‌న తాడేప‌ల్లి కొంప‌లో ముసుగుత‌న్ని ప‌డుకున్న మీ నాయ‌కుడికి ఎలాగూ విన‌ప‌డ‌దు. ఏలూరులో వంద‌లాది మంది త‌ల్లుల ఆవేద‌న యిది. త‌మ‌ పిల్ల‌ల్ని బ‌తికించాల‌ని వేడుకుంటున్నారు. మీ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల ఆందోళ‌న మీకు క‌నిపిస్తోందా? మీ శాఖ‌కే సంబంధించిన స‌మ‌స్య మీకు వినిపిస్తోందా?'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
undefined
తాజాగా శ్రీధర్‌ అనే బాధితుడు మృతిచెందడంపైనా లోకేష్ స్పందిస్తూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని అన్నారు. బాధితుడి ప్రాణాలను ఎలాగూ కాపాడలేకపోయారు... కనీసం బాధిత కుటుంబాలను అయినా ప్రభుత్వం ఆదుకోవాలని లోకేష్ కోరారు.
undefined
click me!