పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన చంద్రబాబు

Published : Dec 04, 2020, 09:50 AM IST

పెండింగ్ లో ఉన్న రూ.2500కోట్లు తక్షణమే చెల్లించాలంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి చంద్రబాబు అధ్యక్షతన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు.  జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాభివృద్ధికి గ్రహణం పట్టిందని శాసనసభ పక్ష ఉపనేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. 

PREV
14

24

సంక్షేమం పేరుతో మభ్యపెడుతున్నారని, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగట్లేదు. ఒక్క రోడ్డయినా వేశారా అని ప్రశ్నించారు. నరేగా నిధుల్ని సద్వినియోగం చేసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెదేపా చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే నరేగా బిల్లులు నిలుపుదల చేయటం దుర్మార్గం అని దుయ్యబట్టారు. 

ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రూ.2500కోట్ల తో గ్రామాల్లో 2018-19లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికలు రావటంతో ఆ బిల్లులు నిలిపేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా కక్ష సాధింపుతో జగన్ ఆ బిల్లులు చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

34

ఏడాది క్రితమే రూ. 1860కోట్లు కేంద్రం మంజూరు చేసినా జగన్ వాటిని మళ్లించారన్నారు. అప్పులు చేసి పనులు చేసిన మాజీ స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లేకుండా పోయిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.  1800కోట్లు నిధులు కేంద్రం నుంచి వచ్చినా స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇసుక లేక భవన నిర్మాణ రంగం కుదేలైంది. 70,వేల కోట్ల రూపాయల ఈ ప్రభుత్వం బకాయిలు పడిందని మండిపడ్డారు.

44

రాష్ట్రం లో ఒక్కరు కూడా టెండర్లు వేసే పరిస్థితి లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా కుదేలైంది.జగన్ పాలనలో గుడ్డి, చెవిటి, మూగ ప్రభుత్వం గా మారింది. అసెంబ్లీ మేము ప్రశ్నిస్తే .. అధికార బలంతో మమ్మలను సస్పెండ్ చేస్తున్నారు. మండలిలో మీ అధికార దుర్వినియోగాన్ని నిలదీస్తాం అని హెచ్చరించారు. 

కరోనా విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం తో వ్యవహరించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. వీళ్లు మేల్కొనేసరికే ఏడు వేల మంది కరోనాతో మృతి చెందారు. క్వారంటైన్ నుంచి ఇంటికి‌వెళ్లే వారికి రెండు వేలు అని ప్రకటించి ఇవ్వలేదు. నేటికీ సిఎం, మంత్రులు కనీసం మాస్క్ లు పెట్టుకోరని, అన్ని రంగాలను నాశనం‌ చేసిన జగన్మోహన్ రెడ్డి సిఎం పదవికి అనర్హుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!

Recommended Stories