నెలకి రూ.లక్షపైనే జీతం: ఈ జాబ్ మీకు సెట్ అవుతుందేమో చెక్ చేసుకోండి

First Published | Sep 15, 2024, 10:38 PM IST

మీకు సేవ చేయాలన్న కోరిక ఉందా? అయితే నెలకు రూ.లక్ష జీతం ఇచ్చే ఉద్యోగాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించేది ప్రభుత్వమే. ఉద్యోగం ఏమిటి? ఎక్కడ పనిచేయాలి? ట్రైనింగ్ ఎన్నాళ్లు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

మీకు సేవ చేయాలన్న కోరిక ఉందా? అయితే నెలకు రూ.లక్షకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించేది ప్రభుత్వమే. ఉద్యోగం ఏమిటి? ఎక్కడ పనిచేయాలి? ట్రైనింగ్ ఎన్నాళ్లు? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ ఆర్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దీని కోసం అభ్యర్థులు ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ-నర్సింగ్ చదివిన వారు అయి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారికి రాష్ర్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ ఆర్ ఆధ్వర్యంలో జపనీస్ భాషను కూడా నేర్పిస్తారు. ఎన్5, ఎన్4, ఎన్3 స్థాయిల్లో ఈ భాషను నేర్పించి వారికి జపాన్ దేశంలో హాస్పిటల్లో కేర్ టేకర్స్ గా ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
 


శిక్షణ ఇలా..
జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి, 32 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. శిక్షణ కాలం 6 నెలలు ఉంటుందని,  నావిస్ హెచ్ఆర్, బెంగళూరు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు  తెలిపారు. 
ఫీజులో ప్రభుత్వం సాయం రూ.25 వేలు.. 
శిక్షణ రుసుముగా ఫీజు రూ.3,50,000 గా చెల్లించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. మొదటి రుసుముగా రూ.50,000 చెల్లించాలన్నారు. అందులో రూ.25 వేలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చెల్లిస్తుందని, మిగిలిన రూ.25 వేలు అభ్యర్థి చెల్లించాలని తెలియజేశారు. 
 

మిగిలిన రూ.3 లక్షలను మూడు విడతలుగా అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుంది.  శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్ దేశంలో ఉద్యోగావకాశం కల్పించడానికి కావాల్సిన సదుపాయాలను కూడా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ఎర్ పర్యవేక్షిస్తుందన్నారు.  

ఉద్యోగం పొందిన అభ్యర్థికి  జీతం నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.
 

 ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ లింక్ https://shorturl.at/FB7ok నందు వివరాలని నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెప్టెంబరు 18వ తేదీలోగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 లోపు ఫోన్ నెంబరు 7386706272 కు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. 
 

Latest Videos

click me!