ఏపీలో గాడిద మాంసానికి పెరుగుతున్న గిరాకీ.. ! లైంగిక సామర్థ్యం కోసమని...

First Published Feb 23, 2021, 3:38 PM IST


ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో గాడిద మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం పెరిగిందని ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి, క్రిష్ణ, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉందట.
 

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో గాడిద మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం పెరిగిందని ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి, క్రిష్ణ, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉందట.
undefined
2011 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం గాడిద ఆహారజంతవు కాదు. కాబట్టి గాడిదల్ని చంపడం, ఆహారంగా తీసుకోవడం నేరంగా భావించబడుతుంది. అయితే గాడిద మాంసాన్ని తినేవారు మాత్రం.. దీనివల్ల తమకు ఒంట్లో బలం, శక్తితో పాటు.. లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
undefined
అయితే గాడిద మాంసం ప్రియులు మాత్రం దీనికోసం కష్టాలు పడాల్సి వస్తుందట. రేటు అత్యధికంగా ఉండడమే కాదు.. ఈ వ్యాపారం ఇల్లీగల్ కాబట్టి ఎవరికీ తెలియకుండా కొనుక్కోవాల్సి వస్తుంది. దీని ధర కూడా వేలల్లో ఉంటుందట.
undefined
అయితే ఇప్పటివరకు గాడిద పాలలో పోషక విలువలు, ఆరోగ్యం అనే విషయం తెలుసుకానీ ఇప్పుడు ఈ గాడిద మాంసం తినడం అనేది కొత్తగా వెలుగులోకి వచ్చిందని అధికారుల అంతర్గత సమాచారం.
undefined
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని క్రిమినల్ గ్యాంగ్ లు ఒక గ్యాంగ్ గా ఏర్పాడి ఈ గాడిద మాంసం రాకెట్ నడుపుతున్నాయని సమాచారం. గాడిదల్ని సేకరించడం ఒక గ్యాంగ్ పనైతే, దాన్ని చంపడం, మాంసాన్ని వినియోగదారులకు చేరేలా రహస్యంగా అమ్మకాలు జరపడం వేరే గ్యాంగుల పని.
undefined
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో చాలావరకు గాడిదలు మాయమయ్యాయి. అందుకే ఈ ముఠా సభ్యలు రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, తమిళ నాడు, మహారాష్ట్ర, కర్ణాటకల నుండి గాడిదల్ని తీసుకొస్తున్నారని యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ సెక్రెటరీ గోపాల్ ఆర్ సురాబత్తుల అంటున్నారు.
undefined
కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్న యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫిర్యాదులు కూడా చేశారు. ఈ ఎన్ జీవో గాడిద మాంసం అమ్మే ప్రాంతాలకు రహస్యంగా వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి వాటిని కూడా అధికారులకు అందజేశారు.
undefined
ఈ మేరకు సోమవారం వీణవల్లివారిపేటలోని పాండురంగ రోడ్డు లో గాడిద మాంసం అక్రమవిక్రయం జరుగుతుందని ఈ ఎన్ జీవో పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చారు.
undefined
అంతేకాదు గాడిద మాంసాన్ని మన ఆహారంగా మార్చేస్తే.. ఇక భవిష్యత్తులో గాడిదల్ని చూడాలంటే జూకు వెళ్లాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దీన్నిఅరికట్టే దిశగా చర్యలు తీసుకోవలని సురాబత్తుల అంటున్నారు. గాడిద పాలు, రెగ్యులర్ మీట్ కంటే గాడిద మాంసం అమ్మకాల్లో ఎక్కువ లాభాలు వస్తుండడంతో ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని సురాబత్తుల అంటున్నారు.
undefined
దీనిమీద పశ్చిమ గోదావరి జిల్లా ఎనిమల్ హజ్బెండరీ జాయింట్ డైరెక్టర్ స్పందిస్తూ గాడిదల్ని చంపడం ఇల్లీగల్. వీటిమీద కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ మా జిల్లా పరిధిలో గాడిద మాసం అక్రమ అమ్మకాలు, వధ జరగకుండా చూసుకుంటామని తెలిపారు.
undefined
click me!