రాజోలు ఎమ్మెల్యే రాపాకకు దిమ్మతిరిగే షాక్: జనసైనికుల ప్లాన్ సక్సెస్

First Published Feb 23, 2021, 1:18 PM IST

రాజోలు అసెంబ్లీ స్థానంలో జనసైనికులు స్తానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు షాకిచ్చారు. గ్రామ పంచాయితీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని జనసైనికులు ఎమ్మెల్యేకు తన సత్తా చూపారు.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌‌కి జనసైనికులు షాకిచ్చారు. ఈ నియోజకవర్గంలో జనసేన 10 గ్రామ పంచాయితీలను గెలుచుకొంది. వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించిన గ్రామాల్లో జనసేన రెండో స్థానంలో నిలిచింది.
undefined
గత ఎన్నికల సమయంలో రాజోలు అసెంబ్లీ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. రెండు చోట్ల పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. కానీ రాపాక వరప్రసాద్ విజయం సాధించారు.
undefined
వైసీపీకి మద్దతుగా తాను కొనసాగనని తొలుత ప్రకటించిన రాపాక వరప్రసాద్ ఆ తర్వాత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాపాక వరప్రసాద్ తనయుడు వైసీపీలో చేరారు. రాపాక వరప్రసాద్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు.
undefined
తమ పార్టీకి అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ఉన్నాడో లేడో కూడ తెలియదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.పార్టీ ఆదేశాలను కాదని కూడ అసెంబ్లీలో వైసీపీకి అనుకూలంగా రాపాక వరప్రసాద్ ఓటు వేసిన సందర్భాలు కూడ ఉన్నాయి.
undefined
దీంతో గ్రామ పంచాయితీ ఎన్నికలను జనసైనికులు సీరియస్ గా తీసుకొన్నారు. రాపాక వరప్రసాద్ కు చెక్ పెట్టాలని ప్లాన్ వేశారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది నానుడి. దీంతో వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ, జనసేనలు లోపాయికారిగా కలిసి పనిచేశాయి. దీంతో జనసేన ఈ నియోజకవర్గంలో మంచి ఫలితాలను సాధించాయి.
undefined
ఈ అసెంబ్లీ నియోజకవర్గంలోని 60 గ్రామపంచాయితీల్లో 37 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఈ స్థానాల్లో జనసేన బలపర్చిన అభ్యర్ధులు రెండో స్థానంలో నిలిచారు. 10 స్థానాల్లో జనసేన మద్దతుదారులు విజయం సాధించారు.
undefined
జనసేన, టీడీపీలు వైసీపీకి వ్యతిరేకంగా స్థానికంగా ఒప్పందం కుదుర్చుకొని పనిచేయడంతో ఈ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు షాకిచ్చాయి.
undefined
పడమటిపాలెం ఈటుకూరు, మేడిచర్లపాలెం, బట్టెలంక, రామరాజులంక, కత్తిమండ, కూనవరం గ్రామాల్లో జనసేన బలపర్చిన అభ్యర్ధులు గ్రామ పంచాయితీ సర్పంచ్ లుగా విజయం సాధించారు.
undefined
click me!