అమ్మాయిలు ఉన్మాదుల బారిన పడొద్దు... దివ్య తేజస్విని  ఇన్స్టా వీడియో సంచలనం

First Published Oct 17, 2020, 8:15 AM IST


చనిపోయిన దివ్య తేజస్విని గతంలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి వలన తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆ వీడియో సందేశంలో దివ్య తేజ మాట్లాడుతూ... అబ్బాయిల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మొదట్లో వాళ్లు మంచిగానే ఉంటారు, క్రమేణా వాళ్ళ సైకోయిజం, విలనిజం బయటపెడతారని చెప్పింది. 

విజయవాడ వేదికగా జరిగిన దివ్య తేజస్వినిహత్య రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగారేపింది. ప్రేమోన్మాదినాగబాబుదివ్య తేజఅనే ఇంజనీరింగ్ విద్యార్థిని గొంతు కోసి చంపడంతో పాటు తాను కూడా ఆత్యహత్యకు ప్రయత్నించాడు. ఐతే ఈ ఘాతుకానికి పాల్పడిన నాగబాబుమాత్రం దివ్య తేజను తానుప్రేమ వివాహం చేసుకున్నట్లు చెవుతున్నాడు. మా ప్రేమనుఅంగీకరించని దివ్య తేజ కుటుంబ సభ్యులుఆమెను నాకు దూరం చేశారు. దీనితో ఇద్దరం ఆత్మ హత్యకు ప్రయత్నించామనే వాదన వినిపిస్తున్నాడు.
undefined
చనిపోయిన దివ్య తేజస్విని గతంలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి వలన తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆ వీడియో సందేశంలో దివ్య తేజ మాట్లాడుతూ... అబ్బాయిల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మొదట్లో వాళ్లు మంచిగానే ఉంటారు, క్రమేణా వాళ్ళ సైకోయిజం, విలనిజం బయటపెడతారని చెప్పింది.
undefined
రెండున్నరేళ్ల క్రితం నేను ఒక అబ్బాయిని ప్రేమించాను...మొదట్లోనాతో బాగున్నఅతను చిన్నగానాపై తన సైకోయిజం చూపించడం మొదలుపెట్టాడు. దానితో నేను అతన్ని వదిలివేశాను. అయినప్పటికీ నన్ను వదలకుండా వేధించేవాడు. ఫోన్ నంబర్ ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కొత్త నంబర్లతో ఫోన్ చేసి బెదిరించే వాడు. 17 కొత్త ఫోన్ నంబర్లనుండి నాకు కాల్ చేయడానికి ప్రయత్నించాడుఅని చెప్పింది దివ్య.
undefined
ఆమె ఇంకా మాట్లాడుతూ.. అతను నాగురించి చెడు ప్రచారం చేస్తున్నాడు. ఇదంతా నేను నా కుటుంబానికి చెప్పాను. వారు నాకు అండగానిలిచారు. కానీ ఆడపిల్లను కావడంవలన నాకు అభద్రతా భావం వుంది. నన్ను, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తాడనే భయం ఉంది. అందుకే పోలీసులకుపిర్యాదు చేయడం లేదు. వేధింపులు ఎక్కువైతే చేస్తాను.నా బ్రదర్ కూడా డిపార్మెంట్ లో ఉన్నాడు.నా ఫ్రెండ్స్ లోనే కొందరు అతనికి సహాయం చేస్తున్నారు. నా పరిస్థుతులలోవాళ్ళుఉంటే ఏం చేస్తారో ఆలోచించుకోవాలి. నన్ను కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ చేయాలని చూశాడుఅని దివ్య ఆ వీడియోలో మాట్లాడారు.
undefined
ఈ వీడియోలో దివ్యఎవరి పేరూప్రస్తావించలేదు. ఐతే ఆమె చెప్పింది నాగేంద్రబాబు గురించే అని అందరూ నమ్ముతున్నారు. నాగేంద్ర బాబుతోఆమె సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు బయటికి రాగా.. గతంలోదివ్య తేజఅతని ప్రేమలో ఉన్నప్పటివి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
undefined
click me!