బెజవాడ టీడీపీలో వర్గపోరు: నాగులుమీరాపై సోషల్ మీడియాలో పోస్టులు, కేశినేని సంచలనం

First Published Feb 19, 2021, 3:31 PM IST

బెజవాడ టీడీపీ నేతల మధ్య వర్గ విబేధాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాగుతున్న తరుణంలో నేతలు తమ మధ్య ఉన్న విబేధాలను వీడడం లేదు. నేతల మధ్య ఆధిపత్యపోరు బజారున పడుతున్నారు. 

రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కూడ టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది. నేతల మధ్య సఖ్యత లేకపోగా ఒకరిపై మరొకరు అధిపత్యం సాధించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బెజవాడ టీడీపీలో చోటు చేసుకొన్న వర్గ విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సెగ్మెంట్ నుండి కేశినేని నాని విజయం సాధించారు. ఈ స్థానంలో విజయవాడ ఈస్ట్ నుండి టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు.
undefined
రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించిన మూడు ఎంపీ స్థానాల్లో విజయవాడ ఒక్కటి కావడం గమనార్హం. వైసీపీ అభ్యర్ధిగా పీవీపీ పోటీ చేసినా కూడ కేశినేని నాని విజయం సాధించారు.
undefined
విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవికి కేశినేని నాని కూతురు శ్వేతను పార్టీ నాయకత్వం ఖరారు చేసిందనే ప్రచారం సాగుతోంది. అయితే ప్రత్యర్ధి వర్గం మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. మేయర్ అభ్యర్ధిని పార్టీ నాయకత్వం ఇంకా ఖరారు చేయలేదంటున్నారు నాని ప్రత్యర్ధులు.
undefined
గతంలో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మేయర్ అభ్యర్ధిని కేటాయించారు. ఈ దఫా సెంట్రల్ నియోజకవర్గానికి మేయర్ పదవిని ఇవ్వాలని కొందరు నేతలు కోరుతున్నారు. విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవి విషయంలో కూడ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం లేదనే ప్రచారం సాగుతోంది.
undefined
మేయర్ పదవిని గద్దె అనురాధకు లేదా బొండా సుజాతకు సింగిరెడ్డి కుటుంబానికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని కేశినేని నాని ప్రకటించారు. తన కూతురు నామినేషన్ ను వెనక్కి తీసుకొంటానని ఆయన తేల్చి చెప్పారు.విజయవాడలో టీడీపీని గెలిపించుకొంటామన్నారు. మేయర్ అభ్యర్ధి ఎవరో చంద్రబాబు నిర్ణయిస్తారని నాని చెప్పారు.
undefined
దీంతో కేశినేని నాని విజయవాడలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కేశినేని నానికి బుద్దా వెంకన్నకు మధ్య అగాధం కొనసాగుతోంది. గత ఎన్నికల సమయం నుండి ఇదే పరిస్థితి నెలకొంది.
undefined
కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ప్రచారం సమయంలో బుద్దా వెంకన్న వర్గీయులు నానిని అడ్డుకొన్నారు. వన్ టౌన్ నాలుగు స్థంబాల సెంటర్‌లో డివిజన్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన నానిని బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకొన్నారు.
undefined
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత నాగులు మీరా టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని నాగులు మీరా ఖండించారు.
undefined
తాను టీడీపీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. టీడీపీ నేతల మధ్య వర్గపోరులో భాగంగానే సోషల్ మీడియాలో నాగులు మీరా వైసీపీలో చేరుతారనే ప్రచారం ప్రారంభమైందనే చర్చ కూడ లేకపోలేదు.
undefined
click me!