విజయవాడ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తోంది ఏపీ సర్కార్. ఇందులోభాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లు, రిహార్సల్స్ ను డిజిపి గౌతమ్ సవాంగ్ పరిశీలించారు.
డిజిపి సమక్షంలో ముఖ్యమంత్రి ప్రసంగం, పోలీస్ పరేడ్ పై మాక్ డ్రిల్ నిర్వహించారు పోలీసులు. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు, వీఐపీలు ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు కాబట్టి పటిష్టమైన బద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులు డిజిపి ఆదేశించారు.
undefined
ఈ సందర్భంగా డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... కోవిడ్ దృష్ట్యా వివిఐపి, విఐపిలతో పాటు పరిమితి స్థాయిలో మాత్రమే సందర్శకులకు అనుమతించనున్నట్లు తెలిపారు. ఇక వర్షంలో సైతం పరేడ్ కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
undefined
ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిజిపి తెలిపారు. ఈ వేడుకల్లో హాజరయ్యేవారు కూడా కోవిడ్ నిబంధనల విషయంలో పోలీసులకు సహకరించాలని డిజిపి సవాంగ్ సూచించారు.
undefined