ఎంపీపీ ఎన్నికలు: రోజాకు అసమ్మతి సెగ, మరింత మంది ఎమ్మెల్యేలకు సైతం...
Siva Kodati |
Published : Sep 25, 2021, 02:56 PM ISTUpdated : Sep 25, 2021, 03:01 PM IST
పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలతో మంచి జోష్ మీదున్న అధికార వైసీపీకి... ఎంపీపీల ఎన్నిక మాత్రం ఝలక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన మండలపరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పలుచోట్ల అసమ్మతి అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. అధికార పార్టీకి ఆధిక్యం లభించినా, అసమ్మతివర్గాలు ఎదురుతిరిగాయి. దీంతో ఎమ్మెల్యేలు నిర్ణయించినవారు కాకుండా, వేరే అభ్యర్థులు మండలపరిషత్ అధ్యక్షులయ్యారు.
తెలుగుదేశం పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష చేయడం, దాన్ని పోలీసులు భగ్నం చేయడం, ఆయనను ఆస్పత్రిలో చేర్చడం వరకు టీడీపీ బాగానే పనిచేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా శ్రీనివాస్ ను చంద్రబాబు పరామర్శించి, వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్ ను నిందించడం తప్ప కేంద్ర ప్రభుత్వంపై ఆయన పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు.
అధికార పార్టీలోని రెండువర్గాల మధ్య అక్కడక్కడ తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీరికి అక్కడక్కడ టీడీపీ, జనసేన, స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 649 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు ప్రారంభించగా.. వాటిలో 15 అధ్యక్ష, 30 ఉపాధ్యక్ష స్థానాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ 624, టీడీపీ 7, జనసేన, సీపీఎం చెరో ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఒక స్థానం స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. ఈ స్వతంత్ర అభ్యర్థి తెలుగుదేశంలో చేరినట్లు సమాచారం.
25
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలో ఎమ్మెల్యే రోజా ప్రతిపాదించిన అభ్యర్థిని వ్యతిరేకిస్తూ.. భాస్కర్‌రెడ్డి బరిలో నిలిచారు. అసమ్మతి వర్గం గైర్హాజరుతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. నిండ్ర ఎంపిపి స్థానానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా దీపా అనే అభ్యర్థిని ఎంపిక చేసారు. అదే పార్టీలో ప్రస్తుతం శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ఉన్న చక్రవన్ని రెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలనీ ఐదుగురు ఎంపీటీసీలతో క్యాంపు రాజకీయం చేశారు. దీంతో సెప్టెంబర్ 24న జరగాల్సిన ఎన్నికలకు ఐదుగురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు.
35
TAMMINENI SITARAM
స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలుండగా.. వైసీపీ 12, టీడీపీ 9 గెలుచుకున్నాయి. ఎంపీపీ స్థానానికి వైసీపీ బరిలో నిలిపిన వ్యక్తికి 9 మంది ఎంపీటీసీలు మద్దతిచ్చారు. మిగతా ముగ్గురు అసమ్మతివర్గంగా ఏర్పడ్డారు. వీరు, టీడీపీ సభ్యులు గైర్హాజరవడంతో ఎన్నిక వాయిదా పడింది.
45
alla ramakrishna reddy
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 టీడీపీ, ఒకటి జనసేన, 8 వైసీపీ గెలిచాయి. మండల పరిషత్‌ను దక్కించుకునేందకు వీలుగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. అధికార వైసీపీ తమ సభ్యులను ఎక్కడ లాక్కుంటుందోనని టీడీపీ, జనసేన సభ్యులు శుక్రవారం హాజరుకాలేదు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
55
దానికితోడు, వచ్చే లోకసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెసును ఎదుర్కోవడానికి బిజెపికి టీఆర్ఎస్, వైసీపీల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ఏపీలో బిజెపికి ప్రత్యామ్నాయం ఉంది. పవన్ కల్యాణ్ జనసేన, చంద్రబాబు టీడీపీలతో కలిసి వైసీపీని ఎదుర్కోవడానికి బిజెపి ప్రయత్నించవచ్చు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు, కడియం మండలాల్లో జనసేన మద్దతుతో టీడీపీ, మలికిపురం మండలంలో టీడీపీ మద్దతుతో జనసేన ఎంపీపీ స్థానాల్ని దక్కించుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వీరవాసరం, ఆచంట ఎంపీపీలుగా టీడీపీ అభ్యర్థులు జనసేన మద్దతుతో ఎన్నికయ్యారు. కృష్ణాజిల్లా చల్లపల్లి, మోపిదేవి, కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలాల్లో టీడీపీ ఎంపీపీ స్థానాల్ని దక్కించుకుంది.