అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్ బ్యాగు, బూట్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు సీఎం జగన్. క్యాంప్ కార్యాలయంలో బ్యాగులు, బూట్ల నాణ్యతను విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు జగన్. విద్యా సంవత్సరం మొత్తం వచ్చేలా మంచి నాణ్యతతో వీటిని తయారుచేయించినట్లు సీఎంకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు.