CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple
తిరుమల: సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్షదైవంగా ఏడుకొండలపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసమేతంగా స్వామివారి సన్నిధికి చేరుకున్న సిజెఐ అభిషేక సేవలో పాల్గొన్నారు.
24
CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple
తిరుమలకు చేరుకున్న సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబానికి మహాద్వారం వద్ద టిటిడి ఈవో ధర్మారెడ్డి సాదరస్వాగతం పలికారు. టిడిపి అధికారులు దగ్గరుండి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబానికి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకులు మండపంలో అర్చకులు వేదఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
34
CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple
తిరుమల కొండపైగల పుష్కరిణిలోకి దిగిన జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వామివారికి దండం పెట్టుకున్నారు. అనంతరం పక్కనే వున్న వరాహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేసారు.
44
CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple
సిజెఐ ఎన్వీ రమణ కుటుంబానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ధర్మారెడ్డితో పాటు డిప్యూటీ ఈవో రమేష్ బాబు, హరీంద్రనాథ్ తో మిగతా టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. వీరంతా ఎన్వీ రమణ కుటుంబంతోనే వుండి దర్శనం తదితర ఏర్పాట్లు చూసుకున్నారు.