తమ్ముడు పవన్ పోరు: చిరంజీవికి వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ దొరికేనా?

Published : Oct 10, 2019, 12:54 PM IST

సినీ నటుడు చిరంజీవి ఏపీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది.

PREV
111
తమ్ముడు పవన్ పోరు: చిరంజీవికి వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ దొరికేనా?
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాజీ కేంద్ర మంత్రి చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఇస్తారా లేదా అనే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. చిరంజీవి సోదరుడు ప్రజా రాజ్యం చీఫ్ పవన్ కళ్యాణ్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో చిరంజీవి మాత్రం జగన్ అపాయింట్ మెంట్ కోరడం రాజకీయంగా ప్రాధాన్యతను కలిగిస్తోంది.

211
చారిత్రక నేపథ్యంలో ఉన్న సైరా సినిమాలో చిరంజీవి నటించారు. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రత్యేక షో వేసి సీఎం జగన్ కు చూపించాలని చిరంజీవి భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే జగన్ అపాయింట్‌మెంట్ కోసం చిరంజీవి ప్రయత్నించినట్టుగా ప్రచారం సాగుతోంది.

311
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జగన్, చిరంజీవి ఇద్దరూ ఓకే పార్టీలో ఉన్నారు. పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో చిరంజీవికి ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ కేంద్రమంత్రి పదవి ఇచ్చింది. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేసిన సమయంలో కడప పార్లమెంట్ స్థానానికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

411
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో చిరంజీవిపై జగన్ అనుచరులు కోడిగుడ్లతో దాడికి దిగారు.

511
అయినా కూడ ఆ సమయంలో చిరంజీవి కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని పూర్తి చేశారు. ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు చిరంజీవి.

611
2014లో రాష్ట్ర విభజనను చిరంజీవి వ్యతిరేకించారు. అప్పటి నుండి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అదే సమయంలో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాన్ జనసేనను ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

711
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. 2014, 2018 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్‌సీపీ చీఫ్ జగన్ కు వ్యతిరేకంగా విమర్శలు చేశారు.

811
జగన్ సీఎం అయ్యాక కూడ పవన్ కళ్యాణ్ ఇదే రకమైన పంథాను కొనసాగిస్తున్నారు. జగన్ అనుసరిస్తున్న విధానాలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ కళ్యాణ్ సునిశిత విమర్శలు చేస్తున్నారు.

911
సైరా నినిమాకు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడ చెప్పాడు. అయితే ఈ సినిమాను సీఎం జగన్ కు ప్రత్యేక షో వేసి చూయించాలని చిరంజీవి భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే చిరంజీవి జగన్ అపాయింట్ మెంట్ కోరారని అంటున్నారు.

1011
అయితే చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో సైరా సినిమా ప్రత్యేక షో చూసేందుకు జగన్ అంగీకరిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు. వీరిద్దరూ కలవడం రాజకీయంగా కూడ ప్రాధాన్యత కల్గించే అంశమే.

1111
పట్టువస్త్రాలు తీసుకొస్తున్న సీఎం జగన్
పట్టువస్త్రాలు తీసుకొస్తున్న సీఎం జగన్
click me!

Recommended Stories