బావమరిది కోటంరెడ్డితో విభేదాలు: బావ కాకాణి షాకింగ్ కామెంట్స్

First Published Oct 9, 2019, 5:45 PM IST

నెల్లూరు జిల్లాపై పట్టుకోసం కాకాణి, కోటంరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గోవర్థన్ రెడ్డి తన హవాను నడిపించాలని చూస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు జిల్లాపై పట్టుకోసం కాకాణి, కోటంరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గోవర్థన్ రెడ్డి తన హవాను నడిపించాలని చూస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంపీడీవో సరళ మీద దాడి ఎపిసోడ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చి కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది.
undefined
కోటంరెడ్డి బంధువొకరు వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారు. దానికి నల్లా కనెక్షణ్ ఇవ్వాల్సిందిగా ఆయన ఎంపీడీవోను కోరుతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కోటంరెడ్డి ద్వారా ఎంపీడీవో సరళకు ఫోన్ చేయించారు. ఆయన చెప్పినప్పటికీ ఎంపీడీవో ససేమిరా అనడం.. దీనిపై శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం అసలు వివాదానికి కారణం.
undefined
ఇదే సమయంలో శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తన అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలతో పాటు కాకాణి అనుచరుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. విషయం రచ్చకెక్కి పార్టీ పరువు గంగలో కలుస్తుండటతో వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను పిలిచి రాజీ కుదార్చాల్సిందిగా వైసీపీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు.
undefined
ఈ క్రమంలోనే బుధవారం అమరావతిలోని సుబ్బారెడ్డి ఇంటికి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ తదితరులు హాజరై గొడవకు దారి తీసిన కారణాలు, ఎంపీడీవో సరళపై దాడి, ఫిర్యాదు వెనుకున్న వ్యక్తులు ఇతర అంశాలపై వైవీ వారితో చర్చించారు
undefined
ఈ భేటీ ముగిసిన అనంతరం కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న జరిగే రైతు భరోసాపై ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని రాజకీయ వివాదాలపై ఎలాంటి చర్చ జరగలేదని కాకాణి స్పష్టం చేశారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి జిల్లాకు రానుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు, రైతు భరోసా విధివిధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు గోవర్థన్ రెడ్డి తెలిపారు.
undefined
తామిద్దరం బాల్యమిత్రులమని మా ఇద్దరి మధ్యా విభేదాలకు తావులేదని కాకాని స్పష్టం చేశారు. తమ మధ్య మూడో వ్యక్తి వచ్చి మధ్యవర్తిత్వం చేయాల్సినంత అవసరం తాము బతికున్నంత వరకు జరగదన్నారు. శ్రీధర్ రెడ్డి తనకు బావమరిదని ఆయనతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సంబంధాలున్నాయని కాకాణి తెలిపారు.
undefined
click me!