చిత్తూరు: శుభకార్యానికి వెళుతూ ఆనందోత్సాహాల మద్య సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా ఆర్తనాదాలు, పెడబొబ్బలతో విషాదంగా మారింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుండి చిత్తూరు జిల్లా ధర్మవరంకు చెందిన యువకుడి నిశ్చితార్థం చిత్తూరు జిల్లా యువతితో ఇవాళ తిరుచానూరులో జరగాల్సి వుంది. ఈ క్రమంలో శనివారం రాత్రే పెళ్లిబృందం ధర్మవరం నుండి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరగా తిరుపతి సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. బాకరాపేట వద్ద ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది మృతిచెందగా మరో 45మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలంలో రక్తసిక్తమైన మృతదేహాలు, క్షతగాత్రులతో భయానక వాతావరణం నెలకొంది.