కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పరిణామాల మేరకు స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఇవాళ ఆయన పర్యటనకు భారీగా పోలీసు భద్రతను పెంచింది. చంద్రబాబును కలసి తమ సమస్యలను విన్నవించుకుని, వినతులు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ వద్దకు బాధిత ప్రజలు చేరుకున్నారు.