టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు సవాల్ విసిరారు. పోలీసులపై కూడ ఆయన విరుచుకుపడ్డారు.
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడుతున్న చంద్రబాబు.రెండేళ్లుగా వైసీపీ నేతలు తమపై బూతులు మాట్లాడారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరిది తప్పో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
212
chandrababu
ఇప్పటికే చంద్రబాబు రెండు దఫాలు కుప్పం టూర్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఇవాళ ఆయన కుప్పంలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికల్లో వైసీపీ ఈ నియోజకవర్గంలో పుంజుకోవడం టీడీపీ శ్రేణులను ఇబ్బందికి గురి చేస్తోంది.
312
chandrababu
కుప్పం బస్టాండ్ సెంటర్ లో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో రెండేళ్లుగా వైసీపీ తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయిస్తోందన్నారు. కేసులకు తమ పార్టీ కార్యకర్తలు భయపడని ఆయన తేల్చి చెప్పారు.
412
chandrababu
తమ పార్టీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు
512
chandrababu
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. కమిషన్ ఏర్పాటు చేసి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకొంటామన్నారు.
612
chandrababu
ఏపీ సీఎం జగన్ పై బూతు వ్యాఖ్యలకు సంబంధించి స్పందించారు. మీరు మాట్లాడితే తప్పు కాదు , మేం మాట్లాడితే మా పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇద్దరి మాటలను ప్రజల ముందు ఉంచుదామని చంద్రబాబు సవాల్ విసిరారు.
712
chandrababu
ు.చంద్రబాబుకు సభలో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. గతంలో కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి తీసుకురావాలని చంద్రబాబును ఆ పార్టీ కార్యకర్తలు కోరా
812
chandrababu
కుప్పం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సభలో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
912
chandrababu
చంద్రబాబును భారీ గజమాలతో ఆ పార్టీ కార్యకర్తలు సన్మానించారు. భారీ క్రేన్ ను ఉపయోగించి గజమాలను చంద్రబాబుకు వేశారు.
1012
chandrababu
కుప్పంలో రోడ్ షో సందర్భంగా కొద్దిసేపు చంద్రబాబు కారు దిగి నడుచుకొంటూ వెళ్లారు. పార్టీ కార్యకర్తలతో కలిసి నడిచారు.
1112
chandrababu
కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు మంగళహరతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు. హరతి పడుతున్న మహిళలకు బాబు అభివాదం తెలిపారు.
1212
chandrababu
రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం లో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. వరుస ఓటములపై ఆయన చర్చించనున్నారు.