వెనక్కి తగ్గని చంద్రబాబు: విపక్ష నేతలతో భేటీ, రేపు ఢిల్లీలో ధర్నా

First Published May 20, 2019, 12:06 PM IST

కేంద్రంలో బీజేపీయేతర ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. సోమవారం నాడు అమరావతి నుండి చంద్రబాబునాయుడు బెంగాల్ వెళ్లనున్నారు.

కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
undefined
సోమవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎంత మమత బెనర్జీతో భేటీ కానున్నారు. అమరావతి నుండి చంద్రబాబునాయుడు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటలకు బెంగాల్ వెళ్లనున్నారు.
undefined
తాజా రాజకీయ పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎం మమత బెనర్జీతో చర్చించనున్నారు. బీజేపీయేతర పార్టీలనే ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా శని, ఆదివారాల్లో కూడ చంద్రబాబునాయుడు పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించారు.
undefined
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిలతో బాబు చర్చించారు. ఈ పార్టీలతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో బాబు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీలతో కూడ బాబు సమావేశమయ్యారు.
undefined
ఆదివారం నాడు సాయంత్రం చంద్రబాబునాయుడు ఢిల్లీ నుండి నేరుగా అమరావతికి వచ్చారు. సోమవారం నాడు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశం కానున్నారు.
undefined
బెంగాల్ సీఎంతో సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం నాడు మరోసారి ఢిల్లీలో విపక్షపార్టీలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించిన తర్వాత ఈవీఎం‌లను లెక్కించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీలో విపక్షాలతో కలిసి చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు.
undefined