జగన్ తాడేపల్లి ఇంటి వద్ద టెన్షన్ (ఫొటోలు)

First Published Jul 19, 2021, 11:30 AM IST

ఇటీవల వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపుమేరకు విద్యార్థిసంఘాల నాయకులు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ సమస్యలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థిసంఘాలు నిరసనకు దిగాయి. ఇటీవల వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపుమేరకు విద్యార్థిసంఘాలు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
undefined
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో తాడేపల్లిలోని జగన్‌ నివాస పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ టిడిపి అనుబంధ విభాగాలైన తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, వివిధ యువజన, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ‘చలో తాడేపల్లి’ కార్యక్రమం చేపట్టారు.
undefined
ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ జాతీయ రహదారి నుంచి సీఎం ఇంటి ముట్టడికి ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో తాడేపల్లి పాత టోల్‌గేట్‌ కూడలి వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
undefined
జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలంటూ ఆయా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలువురు టీఎస్‌ఎస్‌ఎఫ్‌, యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిరసనకారులను గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
undefined
నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా సుమారు వెయ్యి మంది పోలీసులు మోహరించారు. సీఎం ఇంటి వైపు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
undefined
click me!