పోకిరి సినిమాలో బ్రహ్మానందంలా... నిరుద్యోగులకు ముష్టేస్తారా జగన్ రెడ్డి..: లోకేష్ సీరియస్

First Published Jul 15, 2021, 1:15 PM IST

గత ఎన్నికల సమయంలో ఫ్యాన్ ను చూపించి ఓట్లు వేయమని అడిగిన జగన్ ఇప్పుడు అదే ఫ్యాన్ కు నిరుద్యోగ యువత ఉరేసుకునేలా చేస్తున్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మంగళగిరి: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫ్యాన్ చేతపట్టి తిప్పుతూ అధికారం రాగానే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చింది నిజం కాదా జగన్ రెడ్డి? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిలదీశారు. అంతేకాదు 2.30 లక్షల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ అని కూడా అన్నారు కదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకొని నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... కనిపించడం లేదా అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత 10 వేల ఉద్యోగాలతో జాదూ క్యాలెండర్ విడుదల చేసారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
undefined
మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో నిరుద్యోగ యువతతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓ సినిమాలో బ్ర‌హ్మానందం రూపాయి వేసి పండ‌గ చేస్కోమంటారు....అలాగే జగన్ రెడ్డి కూడా 36 గ్రూప్1,2 ఉద్యోగాలు ముష్ఠి వేస్తున్నా పండ‌గ చేస్కోమంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు జాబు రావాలి అంటే బాబు పోవాలి అని సెటైర్లు వేసారు...ఇప్పుడు జాదూ రెడ్డి మొఖం చూసి కంపెనీలు అన్నీ పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయన్నారు. జే ట్యాక్స్ దెబ్బకి రెండేళ్ల పాలనలో ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా ఆంధ్రపదేశ్ వైపు చూడలేకపోగా రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, లులూ,అదానీ ఇలా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి బై బై చెప్పేసాయన్నారు. ప్రైవేట్ కంపెనీలు రావు... ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
undefined
''జాదూ క్యాలెండర్ విడుదల చేస్తూ రెండేళ్ల లో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ ఫేక్ కబుర్లు చెప్పారు. కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ పోస్టులు,పేపర్ లీక్ చేసి అమ్ముకున్న సచివాలయ పోస్టులు, దశాబ్దాలుగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇలా చెప్పుకుంటేపోతే మొత్తం ఫేక్ లెక్కలే. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చెయ్యడం.... ఇది ఉద్యోగం కాదన్నది జగన్ మోసపు రెడ్డి గారే. మరి ఇప్పుడు ఉద్యోగాల లిస్టులో కలపడానికి సిగ్గు వెయ్యలేదా? 90 శాతం వాలంటీర్ పోస్టులు కార్యకర్తలకే ఇచ్చాం అని ఏ2 రెడ్డి గొప్పగా ప్రకటించారు'' అని తెలిపారు.
undefined
''గ్రామ,వార్డు సచివాలయం - 1.21 లక్షలు. పేపర్ లీక్ చేసి, వైకాపా కార్యకర్తలకు అమ్ముకున్నారు. ఆర్టీసి ఉద్యోగులు - 58 వేల మంది వీరంతా దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తున్నారు. కోవిడ్ నియామకాలు - 26 వేలు. ఇవి తాత్కాలిక ఉద్యోగాలే. ఆప్కోస్ - 95 వేల మంది ఇందులో అత్యధికం మద్యం షాపుల్లో పని చేసే వారు. ఇవన్నీ తీసేస్తే నిజమైన అర్హులకు వచ్చిన ఉద్యోగాలు 15 వేల లోపే. అవి కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలిపి. ఉద్యోగాలు ఇచ్చింది లేకపోగా టిడిపి హయాంలో ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం 2వేల నిరుద్యోగ భృతి పథకాన్ని రద్దు చేసారు'' అని మండిపడ్డారు.
undefined
''2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు స్తోమతకి మించి, అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు వారంతా తిరిగి ఊరు వెళ్లలేక, అమ్మానాన్నలకు మొఖం చూపించలేక ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల జాదూ రెడ్డి పాలనలో నిరుద్యోగం పెరిగిపోయింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగాలు రాక 300 మంది నిరుద్యోగ యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్పడ్డారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం చదువుకున్న వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నిరుద్యోగ రేటు 38% ఉంది. దక్షిణాది రాష్ట్రాల‌తో పోల్చుకుంటే మన రాష్ట్ర నిరుద్యోగ రేటు ఎక్కువ. దేశంలోనే నిరుద్యోగ రేటు ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల‌లో ఏపీ 4వ స్థానంలో ఉంది'' అంటూ లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
undefined
''చంద్రబాబు ప్రభుత్వం 15.45లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 32లక్షల ఉద్యోగాల కల్పనకు ఎంఓయూలు చేసుకుంది. టిడిపి హయాంలో 5లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించి, 5.13లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాథి కల్పించారని వైసిపి ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది.చంద్రబాబు పాలనలో కియా, హీరో, అపోలో టైర్స్, ఫ్యాక్స్ కాన్, డిక్సన్ లాంటి అనేక కంపెనీలు వచ్చాయి. మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా, ఉద్యోగాలు ఇస్తా అన్నారు.ఇప్పుడు కేసుల మాఫీ కోసం మోదీ కాళ్ళు పట్టుకుంటున్నారు'' అన్నారు.
undefined
''కర్నూలు జిల్లా చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. క‌ర్నూలు జిల్లా గోపాల‌న‌గ‌రం గ్రామానికి చెందిన నాగేంద్ర‌ప్ర‌సాద్ బీఈడీ పూర్తిచేసి టీచ‌ర్ ఉద్యోగం సాధించాల‌నే కల కన్నారు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడటం బాధాకరం. నాగేంద్ర‌ప్ర‌సాద్ తల్లి జ‌య‌ల‌క్ష్మమ్మ‌ గారిని నిన్న కలిసాను. ఆమె బాధ చూసిన తరువాత నాకు కన్నీరు ఆగలేదు. ఆత్మ‌హ‌త్య‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కానే కాదు. నిరుద్యోగులారా నిరుత్సాహ పడకండి కలిసి పోరాడుదాం'' అని పిలుపునిచ్చారు.
undefined
''తక్షణమే జాదూ క్యాలెండర్ రద్దు చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. పాదయాత్రలో మీరు వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది 6500 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి. గ్రూప్ 1 & గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టుల‌తో జాబ్ క్యాలెండర్ కొత్త‌గా విడుద‌ల చేయాలి. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి మెగా డిఎస్‌సి నోటిఫికేష‌న్ ఇవ్వాలి. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో 20,000 వేల‌కు పైగా ఖాళీలకు నియామ‌కాలు చేప‌ట్టాలి. రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. టిడిపి ప్రభుత్వ హ‌యాంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగుల‌కిచ్చిన 2000 నిరుద్యోగ భృతిని తక్షణమే అందించాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
undefined
click me!