ఎన్ని ఇబ్బందులు ఎదురువచ్చిన అత్మవిశ్వాసంతో నిలబడటం చంద్రబాబు నైజం. కష్టాలను అవకాశాలుగా మలుచుకోని విజయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు నిత్యం తపిస్తున్నారు.
ఇంకా, నాడు కేవలం 5 వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యే రాష్ట్రంలో నేడు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమైంది. పోలవరం ప్రాజెక్టుకు ప్రతి సోమవారం కేటాయించి డయాఫ్రం వాల్ నిర్మించారు. ఇక, వీలైనంత తొందరగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి... జీవనాడిని ప్రజలకు అందించాలని చంద్రబాబు ప్రతినిత్యం తపిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఇలా...
చంద్రబాబు నాయుడు జీవితంలో 2019 ముందు రాజకీయాలు ఒక రకంగా, 2019 తరువాత రాజకీయాలు మరోక రకంగా ఉన్నాయి. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు పని చేసిన చంద్రాబు నాయుడు... 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత ప్రభుత్వం జైలుకు పంపింది. స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు అనేక కేసులు నమోదయ్యాయి. అయినా చంద్రబాబు నాయుడు భయపడలేదు. కేసులపై పోరాటం చేసి బయటకు వచ్చారు.
చివరికి గత ప్రభుత్వంలో ఆయన ఇంటిపైనా దాడులు జరిగాయి. ఆ తర్వాత జనసేన, బీజేపీతో తెలుగుదేశం కూటమి కట్టారు చంద్రబాబు. ప్రజల మద్దతుతో గతంలో ఎన్నడూ సాధించనన్ని మెజారిటీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించారు.