వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన బిజెపి: విస్తరణ వ్యూహం ఇదే...

First Published Jun 5, 2019, 4:18 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తోందా...కేంద్రంలో అఖండ విజయం సాధించామనే ధీమాతో ఉన్న బీజేపీ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నిస్తోందా....ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాకముందే బీజేపీ జాతీయ నాయకత్వం విమర్శలు గుప్పిస్తే రాష్ట్ర నాయకత్వం మాత్రం సూచనలు సలహాలు ఇస్తోంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తోందా...కేంద్రంలో అఖండ విజయం సాధించామనే ధీమాతో ఉన్న బీజేపీ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రయత్నిస్తోందా....ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా కాకముందే బీజేపీ జాతీయ నాయకత్వం విమర్శలు గుప్పిస్తే రాష్ట్ర నాయకత్వం మాత్రం సూచనలు సలహాలు ఇస్తోంది.
undefined
వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ దోబూచులాడుతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే బీజేపీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు స్టార్ట్ చేశారు.
undefined
గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. లౌకిక దేశంలో మతపరమైన పండుగలను ప్రభుత్వ ఖర్చులతో చేయడం తగదంటూ జగన్ కి హితవు పలికారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతుందని గుర్తు చేశారు. విలాసవంతమైన పోరాటాలతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. అలా కొత్తముఖ్యమంత్రి వ్యవహరించరని తాను ఆశిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా సూచించారు.
undefined
జీవీఎల్ విమర్శలు చేసి 24 గంటలు గడవకముందే బీజేపీ రాష్ట్ర నాయకత్వం వినూత్నరీతిలో స్పందించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు అంశాలను ప్రస్తావిస్తూ 7 లేఖలు రాశారు కన్నా.
undefined
పోలవరం నిర్వాసితులకు సాయంతో పాటు విజయవాడలో తొలగించిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని.. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కన్నా లేఖలో విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని, అలాగే దేవాలయ భూముల పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు.
undefined
ఇలా జగన్ కు ఒకేసారి లేఖలు రాయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వైయస్ జగన్ ప్రభుత్వానికి ఆరు నుంచి సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని సూచించారు.
undefined
వైయస్ జగన్ తో బీజేపీ దోబూచులాడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్ష పార్టీ కాదని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అటు జాతీయ నాయకత్వం జగన్ ను ఎన్డీఏలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చింది.
undefined
అయితే వైయస్ జగన్ ప్రత్యేక హోదాపై తేల్చితేనే ఎన్డీఏలో చేరుతామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఉక్కిరి బిక్కిరి లేకుండా చేస్తే జగన్ తమ చెంతుకు వచ్చి చేరుతాడని బీజేపీ ప్లాన్ వేస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తేనే ఏపీలో బీజేపీ పాగా వేయగలమని భావిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని టీడీపీ పదేపదే ఆరోపించింది. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే టీడీపీ టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతోందని తెలుస్తోంది.
undefined
click me!