కేశినేని నాని అలక వెనుక పెద్ద కథే....

First Published Jun 5, 2019, 2:32 PM IST

పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవిని  విజయవాడ ఎంపీ కేశినేని వద్దనడం వెనుక కృష్ణా జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరే కారణమని సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కేశినేని నాని విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అమరావతిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఇంకా పూర్తి కాలేదు. అయితే రాష్ట్ర కార్యాలయం పూర్తయ్యే వరకు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని పార్టీ నేతలు భావించారు.
undefined
అయితే గుంటూరు పార్టీ కార్యాలయం కంటే కూడ విజయవాడలో పార్టీ కార్యాలయమైతే అందరికీ అందుబాటులో ఉంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు.
undefined
దీంతో విజయవాడలో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని చూడాలని చంద్రబాబునాయుడు కేశినేని నానికి వారం రోజుల క్రితం సూచించారు.అయితే ఈ విషయమై కేశినేని నాని భవనాల కోసం పరిశీలిస్తున్నారు.
undefined
మంగళవారం నాడు చంద్రబాబునాయుడు నివాసంలో పార్టీ ముఖ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు గురించి చర్చించారు. దేవినేని ఉమ ఉపయోగించిన కార్యాలయాన్ని తాత్కాలికంగా రాష్ట్ర కార్యాలయంగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయం కేశినేని నానికి నచ్చలేదని తెలుస్తోంది
undefined
రాష్ట్ర కార్యాలయం కోసం భవనాన్ని పరిశీలించాలని తనకు తొలుత సూచించి ఆ తర్వాత దేవినేని ఉమ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడంపై కేశినేని నాని అసంతృప్తికి గురయ్యారు.
undefined
టీడీపీ ఎంపీలకు పదవులను కేటాయించే విషయమై కూడ నాని అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. పదవుల పంపకం విషయంలో నాయకత్వం తీరు సరిగా లేదనే వైఖరితో ఉన్నారని చెబుతున్నారు. తనను అవమానపర్చేవిధంగా పదవుల పంపకం ఉందని నాని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
undefined
అసంతృప్తితో ఉన్న కేశినేని నానితో బుధవారం మధ్యాహ్నం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. నానిని బుజ్జగించేందుకు జయదేవ్ ప్రయత్నించారు. అయితే సోషల్ మీడియాలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని జయదేవ్‌తో నాని చెప్పారని సమాచారం.
undefined
విజయవాడ ఎంపీగా విజయం సాధించిన నాని బీజేపీలో చేరుతారని కూడ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని నాని ఖండించారు. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. బీజేపీలో తాను చేరడం లేదని నాని బుధవారం నాడు స్పష్టం చేశారు.
undefined
విజయవాడ ఎంపీగా విజయం సాధించిన నాని బీజేపీలో చేరుతారని కూడ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని నాని ఖండించారు. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. బీజేపీలో తాను చేరడం లేదని నాని బుధవారం నాడు స్పష్టం చేశారు.
undefined
ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడ పార్టీ పెద్దల తీరులో మార్పు రాలేదని భావనతో కేశినేని నాని ఉన్నారు. గల్లా జయదేవ్ తల్లికి పొలిట్ బ్యూరో లో పదవి ఇవ్వడంతో పాటు జయదేవ్ కు టీడీపీపీలో కీలక పదవిని కేటాయించడంపై నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
undefined
పార్టీ మారుతున్నారని తప్పుడు ప్రచారం సాగుతున్న తరుణంలో విప్ పదవి కేటాయిస్తారా అని నాని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరుణంలో కూడ పదవుల పందేరంపై చంద్రబాబు తీసుకొన్న నిర్ణయంపై నాని అసంతృప్తితో ఉన్నారు.
undefined
click me!