ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.... కరుడుగట్టిన ముఠా సభ్యులు వీళ్లే

First Published | Dec 10, 2021, 10:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ సభ్యుల ఫోటోలను పోలీసులు విడుదల చేసారు. వీరు ఎక్కడ కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతూ అలజడి సృష్టిస్తున్పారు. ఈ నేపథ్యంలో ముఠా కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు కరుడుగట్టిన చెడ్డీ గ్యాంగ్ సభ్యుల పోటోలను విడుదల చేసారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని... ఈ ముఠా సభ్యులు ఎక్కడ కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  ఆందోళన వీడి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.   

చెడ్డీ గ్యాంగ్(cheddi gang) పేరుతో రాష్ట్రంలోకి దొంగల ముఠా వచ్చిందని... రాత్రుళ్లు ఎవరైనా మీ ఇంటి తలుపులు తట్టినా తెరవద్దని పోలీసులు (police) హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాలవారు అనుమానాస్పద స్థితిలో తారసపడితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానితులు, అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించండంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల ప్రకటన కృష్ణా జిల్లా (krishna district) వాసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 
 

Latest Videos


కృష్ణా, గుంటూరు (guntur) జిల్లాల్లోకి అంతరాష్ట్ర దొంగల ముఠాలు చొరబడి దోపిడీలకు పాల్పడుతోంది. పోలీస్ ఉన్నతాధికారుల సమాచారంతో కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటువంటి దొంగల ముఠా వల్ల జిల్లాలో ఏ ఒక్కరూ నష్టపోకూడదని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 
 

స్టేషన్ల వారీగా దొంగల ముఠా సమాచారం ఇచ్చి వారి కదలికలు ఏ విధంగా ఉంటాయో..? వారి నుండి ఏ రక్షణ పొందాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయ పోలీసుల ద్వారా అవగాహన కల్పించటంతో పాటు ప్రధాన కూడళ్లల్లో ఆటోల ద్వారా మైక్ ప్రచారం చేస్తున్నారు.

ఇదిలావుంటే ఇప్పటికే విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా చెడ్డీ గ్యాంగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇటీవల సిపిగా ఛార్జ్ తీసుకోవడంతోనే విజయవాడలో జరిగిన చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జక్కంపూడి సీవీఅర్ ఫ్లై ఓవర్ సమీపంలో చెడ్డీ గ్యాంగ్ సభ్యులు దోపిడీకి పాల్పడిన ఇంటిని కాంతి రాణా టాటా స్వయంగా పరిశీలించారు. 
 

దొంగతనం జరిగిన తీరుతెన్నులను తెలుసుకోవడంతో పాటు బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరాలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ఇతర రాష్ట్ర క్రైమ్ పోలీసుల సహాయ సహకారాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 

దొంగతనం జరిగిన తీరుతెన్నులను తెలుసుకోవడంతో పాటు బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరాలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ఇతర రాష్ట్ర క్రైమ్ పోలీసుల సహాయ సహకారాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 

విజయవాడ పోలీస్ కమిషనర్ వెంట డీసీపీ హర్షవర్ధన్, బాబురావు, క్రైమ్ బ్రాంచ్ ఎడిసీపీ శ్రీనివాస్, వెస్ట్ ఏసీపీ హనుమంత్ రావు, క్రైమ్ ఎసీపీ శ్రీనివాస్, కొత్త పేట సీఐ మోహన్ రెడ్డి తదితర సిబ్బంది కూడా చెడ్డి గ్యాంగ్ దోపిడీకి పాల్పడ్డ ఇంటిని పరిశీలించారు.
 

ఇటీవల చెడ్డి గ్యాంగ్ తాడేపల్లి ప్రాంతంలో కలకలం రేపింది.  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో దోపిడీకి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల గ్యాంగ్ కుంచనపల్లిలో అదే రకంగా ప్రయత్నించి విఫలమైనట్లుగా ఉన్న ఘటన గత ఆదివారం వెలుగుచూసింది.

విజయవాడలో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన ప్లాట్స్ లోనే చెడ్డీ గ్యాంగ్ సభ్యులు దోపిడీకి యత్నించారు. ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరావు కు చెందిన ఫ్లాట్ 44, ఆమంచి కృష్ణమోహన్ చీరాల మాజీ ఎమ్మెల్యే  ఫ్లాట్ 39, వెంకటరెడ్డి హైడ్రాలిక్  పవర్ డిస్ట్రిబ్యూషన్ MD ఫ్లాట్ 37లలో రాత్రి చెడ్డి గ్యాంగ్ దోపిడీకి యత్నించినట్టు  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

click me!