Rice: డీమార్ట్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Published : Oct 12, 2026, 06:41 PM IST

Rice: ప్రస్తుతం నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బియ్యం ధరలు సైతం ఇప్పటికే పెరిగాయి. మరింత పెరిగే అవకాశముందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, డీమార్ట్ లో కంటే తక్కువ ధరకే బియ్యాన్ని అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ వివరాలు మీకోసం.

PREV
15
మార్కెట్లో షాక్ ఇస్తున్న బియ్యం ధరలు.. ఏపీ సర్కార్ మాస్ ప్లాన్

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, పంటల సాగు గణనీయంగా పడిపోవడం వంటి పరిణామాల వల్ల దేశవ్యాప్తంగా నిత్యావసరాల కొరత ఏర్పడింది.

ఈ ప్రతికూల పరిస్థితుల కారణంగా కూరగాయలు, కిరాణా సరుకులతో పాటు ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు కూడా ఆకాశాన్నంటాయి. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన సన్నబియ్యం కిలో ఏకంగా 90 రూపాయల వరకు పలుకుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

25
రైతు బజార్లలో సబ్సిడీ ధరలతో సన్నబియ్యం పంపిణీ

ఓపెన్ మార్కెట్ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, సామాన్యులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కీలక శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలకే నాణ్యమైన సన్నబియ్యాన్ని విక్రయించనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే రైతు బజార్లలో బీపీటీ రకం బియ్యం కిలో రూ.49 చొప్పున అందుబాటులో ఉండగా, తాజాగా కేఎన్ఎం రకం సన్నబియ్యాన్ని కూడా కేవలం రూ.50లకే విక్రయించడం ప్రారంభించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని చేరవేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

35
విజయవాడలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని భవానీపురం రైతు బజార్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రజలపై నిత్యావసరాల ధరల భారం పడకుండా ప్రభుత్వం లోతుగా కసరత్తు చేసిందని వెల్లడించారు.

మార్కెట్లో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఈ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు బజార్‌లోనూ ప్రత్యేక విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ జరిగేలా అధికారులను అప్రమత్తం చేశారు.

45
కుటుంబానికి 26 కిలోల ప్యాకింగ్.. అర్హతలు ఇవే

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సబ్సిడీ బియ్యం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరనుంది. ఒక్కో కుటుంబానికి నెలకు 26 కిలోల ప్యాకింగ్ బస్తాను అందించనున్నారు. ప్రజలు తమ సమీపంలోని రైతు బజార్‌లకు వెళ్లి ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు చూపించి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.

ఇప్పటికే ఉల్లిపాయలను కేవలం రూ.25కే అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు అదే తరహాలో బియ్యాన్ని కూడా సబ్సిడీపై ఇస్తుండటంతో మొదటి రోజే ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. క్యూలైన్లలో నిలబడి ప్రజలు సంతోషంగా ఈ సన్నబియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

55
బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం.. మార్కెట్లోనూ స్థిరత్వం

ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించేవారికి, బ్లాక్ మార్కెట్ వ్యాపారులకు చెక్ పడినట్లయింది. ఈ నిర్ణయం వల్ల రానున్న రోజుల్లో ఓపెన్ మార్కెట్లో కూడా బియ్యం ధరలు క్రమంగా స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమీప రైతు బజార్లను సంప్రదించి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories