నవంబర్ 1న వైఎస్ఆర్ అవార్డులు:గవర్నర్‌ను ఆహ్వానించిన జగన్ (ఫోటోలు)

narsimha lode | Published : Oct 28, 2021 9:56 PM
Google News Follow Us

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  నవంబర్ 1న  కొత్త అవార్డులు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.వైఎస్ఆర్ ,పేరుతో అవార్డులను ఇవ్వాలని ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

19
నవంబర్ 1న వైఎస్ఆర్ అవార్డులు:గవర్నర్‌ను ఆహ్వానించిన జగన్  (ఫోటోలు)
ys jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్నినవంబరు1వ తేదీన నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ జీవిత సాఫల్య , వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

29
ys jagan

రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేయనున్నవైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను నేడు సతీసమేతంగా రాజ్ భవన్ కి విచ్చేసి ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించారు.

39
ys jagan

రాష్ట్రంలో తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సామాన్యులలో అసామాన్యులను వెలికితీసి, అత్యధిక మొత్తాన్ని అవార్డు  కింద అందజేయనున్నారు.

Related Articles

49
ys jagan

నవంబర్ 1వ తేదీన విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ దంపతులను  ఆహ్వానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులు.
 

59
ys jagan


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపర్చిన వ్యక్తులు, సంస్థలకుమొత్తం 59 అవార్డులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
 

69
ys jagan


 29 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు కాగా30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు. కేటగిరీల వారీగా 8 సంస్థలకు,వ్యవసాయ అనుబంధ రంగాలు (11), కళలు,సంస్కృతి రంగాల్లో (20) సాహిత్యం(7 ),  జర్నలిజంలో(6), మెడికల్ అండ్ హెల్త్ కు ( 7 )ఎంపిక చేశారు.

79
ys jagan


వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ(జ్ఞాపిక), మెడల్, శాలువ వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ(జ్ఞాపిక), మెడల్, శాలువ బహుకరిస్తారు..

89
ys jagan

.వ్యవసాయం, కళలు,సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు ఈఅవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్‌తో పాటు అసామాన్య ప్రతిభ కనపరచిన సామాన్యులను అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది.

99
ys jagan

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరామ్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ఆర్.పి సిసోడియా ముఖ్యమంత్రి కార్యదర్శి  ప్రవీణ్ ప్రకాష్ లు పాల్గొన్నారు.

Recommended Photos