ఢిల్లీకి పయనం: మోడీ ఆఫర్ కు వైఎస్ జగన్ నో..?

First Published Oct 5, 2020, 4:35 PM IST

అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీకి ఒక క్యాబినెట్ బెర్త్, రెండు సహాయక మంత్రి పదవులను ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్టుగా తెలియవస్తుంది. దీనిపై జగన్ తన నిర్ణయాన్ని తెలిపేందుకు రేపు మోడీతో సమావేశం అవ్వనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ రేపు నరేంద్రమోడీతో, బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో భాగంగా ఎన్డీఏ కూటమిలోకి వైసీపీని ఆహ్వానించినట్టు తెలియవస్తుంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరపడానికి జగన్ మోహన్ రెడ్డి రేపు ప్రధానిని కలవనున్నట్టుగా సమాచారం.
undefined
ప్రస్తుతానికి హస్తినవర్గాల సమాచారం ప్రకారం బీజేపీ వైసీపీని ఎన్డీఏ లోకి తీసుకురావాలని బలమైన నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి మొన్న అమిత్ షా తో జరిగిన చర్చల్లో కూడా చర్చించినట్టు తెలియవస్తుంది.
undefined
కొద్దిగా గమనించి ఉంటే... జగన్ మీద విరుచుకుపడే రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ ఢిల్లీ టూర్ తరువాత చాలా సైలెంట్ అయిపోయారు. ఎంపీ రఘురామా కృష్ణంరాజు వంటివారు సైతం జగన్ ఢిల్లీలో ఎన్డీఏ లో చేరడానికి లాబీయింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
undefined
ఈ విషయాలను పక్కనుంచితే... అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీకి ఒక క్యాబినెట్ బెర్త్, రెండు సహాయక మంత్రి పదవులను ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్టుగా తెలియవస్తుంది. దీనిపై జగన్ తన నిర్ణయాన్ని తెలిపేందుకు రేపు మోడీతో సమావేశం అవ్వనున్నారు.
undefined
ఇక ప్రస్తుత తరుణంలో ఎన్డీఏ నుండి మిత్ర పక్షాలు విడిపోతున్న తరుణంలో బీజేపీకి మిత్రపక్షాల అవసరం ఉంది. లోక్ సభలో ఎటువంటి మిత్రుల అవసరం లేకున్నప్పటికీ... రాజ్యసభలో మాత్రం అత్యవసరం. ఈ నేపథ్యంలో వైసీపీకి ఒకటి రెండు బెర్తులిచ్చి కూటమిలోకి ఆహ్వానించాలని బీజేపీ భావిస్తుంది.
undefined
ఇటీవల కాలంలో కొన్ని సొంత బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తున్న వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు తెలిపింది. అసలు ఇప్పటివరకు బీజేపీ ప్రవేశపెట్టిన ఏ బిల్లుకు కూడా వ్యతిరేకంగా వ్యవహరించాలేదు వైసీపీ. ఈ నేపథ్యంలో వైసీపీ ఎన్డీఏ లో కలుస్తుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుంది.ఇప్పుడు జగన్ హుటాహుటిన బయల్దేరుతుండడం, ఈ మధ్యనే ఇది రెండవసారి అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
undefined
వైసీపీ ఎలాగూ మద్దతిస్తుంది కదా, కూటమిలో చేర్చుకోవడం ఎందుకు అని అనిపించవచ్చు. కానీ కూటమిలో ఉంటే... శత్రువుల కంటికి దుర్బేధ్యమైన శక్తిగా బీజేపీ కనబడుతుంది. ఇతర పార్టీలను కూడా ఆహ్వానించడం తేలికవుతుంది. ఒక్కొక్కరిగా పార్టీలు బయటకు వెళుతుండడం, బీజేపీ శక్తి తగ్గుతుందేమో అనే మెసేజ్ బయటకు వెళ్లే ప్రమాదం ఉంది.
undefined
రాష్ట్రంలో బీజే,పీ వైసీపీ పై హిందుత్వ కార్డును ప్రయోగిస్తోంది. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో చేరితే ఈ దాడి నుండి వైసీపీ తప్పించుకునే వీలుంటుంది కూడా. జగన్ కి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది.దీని నుండి మాత్రం జగన్ కి తాత్కాలిక ఉపశమనం లభించక మానదు.
undefined
కాకపోతే బీజేపీలో చేరితే తన మైనారిటీ బేస్ ను కోల్పోవాలిసి రావడమే కాకుండా... ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష టీడీపీ గళమెత్తే ఆస్కారం కూడా లేకపోలేదు.రాష్ట్రంలో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని జగన్ మోడీ ఆఫర్ ని రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది.
undefined
ఇందుకు బదులుగా జగన్ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి అడిగినట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఏపీకి గనుక ఈ విషమైన ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ ఎన్నికలు సమీపంలో ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆర్ధిక ప్యాకేజీకి ఒప్పుకోకపోవచ్చు అని వినికిడి.
undefined
చూడాలి రేపటి భేటీలో జగన్ మోహన్ రెడ్డి బీజేపీ ఆఫర్ ని ఒప్పుకుంటారా, లేదా అనేది తేలాల్సి ఉంది. ఇంకొందరు మాత్రం బీజేపీ జగన్ మోహన్ రెడ్డిని సామదానభేధదండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి ఒప్పించొచ్చు అనేవారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా జగన్ మోహన్ రెడ్డి మాత్రం బీజేపీకి మద్దతిస్తూనే ఉంటారు. ఒకవేళ కుదిరితే ఎన్డీఏ భాగస్వామిగా, లేకుంటే... బయటనుంచి మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీగా..!ఏది ఏమైనా బీజేపీకి మాత్రం జగన్ పూర్తి మద్దతునైతే ఇవ్వడం తథ్యం.
undefined
click me!